Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఓ వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి గిరిజనుడి చెవిలో మూత్ర విసర్జన చేసినట్లు చూపించే వీడియో విస్తృతంగా ప్రచారం కావడంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఘటన జరిగిన సమయంలో బాధితుడు మద్యం మత్తులో ఉన్నందున.. ఈ విషయాన్ని గుర్తించలేదు. తర్వాత దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవ్వడం వల్ల జరిగిన అవమానాన్ని బాధితుడు తెలుసుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. జిల్లాలోని జుగైల్ ప్రాంతంలో జులై 11న ఈ ఘటన చోటు చేసుకుంది.
Also Read: Rajasthan: 19 ఏళ్ల యువతి కిడ్నాప్, యాసిడ్ దాడి.. చివరకు మృతదేహాన్ని బావిలో పడేసి..
అసలేం జరిగిందంటే.. సోన్‌భద్ర జిల్లా జుగైల్ ప్రాంతానికి జవహర్ పటేల్, గులాబ్ కోర్‌లకు ఇంతకు ముందే పరిచయం ఉంది. వారిద్దరు కలిసి జులై 11న మద్యం సేవించారు. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో కోపంతో జవహర్ పటేల్.. గులాబ్ కోర్ చెవిలో మూత్ర విసర్జన చేశాడు. బాధితుడు మద్యం మత్తులో ఉండడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరుసటి రోజు తనకు జరిగిన అవమానం గులాబ్ కోర్‌కు అర్థం అయింది. దీంతో గులాబ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు, పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఎవరో చిత్రీకరించారని, అది సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ విషయమై గులాబ్ కోర్ ఫిర్యాదు చేశారని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ట్రెండింగ్ అంశాలు
మధ్యప్రదేశ్‌లో గిరిజన వర్గానికి చెందిన దశమత్ రావత్‌పై మూత్ర విసర్జన చేశారనే ఆరోపణపై ప్రవేశ్ శుక్లాను అరెస్టు చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో అధికార బీజేపీకి ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగిలి, ఆ తర్వాత ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రావత్ పాదాలు కడిగారు.
