NTV Telugu Site icon

Flash Light Eye: ఫ్లాష్ లైట్‎గా మారిన కన్ను.. కళ్లు చెదిరే ఆవిష్కరణ అంటే ఇదే కావొచ్చు

Flash Light

Flash Light

Flash Light Eye: జ్ఞానేంద్రియాల్లో నయనం ప్రధానం. కళ్లు లేకపోతే ప్రతీదానికి మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి. చాలా మంది చేసిన ఆవిష్కరణలన్నీ వారు కోల్పోయిన, జీవితంలో వారు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారాలే. అలాంటిదే ఇక్కడ అమెరికాకు చెందిన బ్రియాన్ స్టాన్లీ చేసిన కళ్లు చెదిరే ఆవిష్కరణ.

బ్రియాన్ స్టాన్లీ అనే ఇంజనీర్ క్యాన్సర్‌తో తన కుడి కన్నును కోల్పోయాడు. కోల్పోయిన కన్ను స్థానంలో తనే సొంతంగా కృత్రిమ కంటిని సృష్టించాడు. అయితే అది మామూలు కన్ను కాదు ఏకంగా లైట్ మాదిరిగా వెలిగే కన్ను. ఇంజనీర్ తన ప్రోస్తెటిక్ ఐబాల్‌ను పూర్తిగా పనిచేసే ఫ్లాష్‌లైట్‌గా మార్చాడు. తానే సొంతంగా ప్రొథెస్టిక్ కన్నుని రూపొందించాడు. తన కనుపాప ఫ్లాష్ లైట్ లా వెలిగేలా తయారు చేశాడు. ఈ కన్నుని టైటానియం సైబర్గ్ కన్నుగా పిలుస్తారు, ఇది ఒక హెడ్ల్యాంప్ గా పనిచేస్తుంది.

Read Also: Russia Ukraine War: చస్తే చస్తాం మళ్లీ తిరిగిరాం.. స్టూడెంట్స్ షాకింగ్ డెసిషన్

ఇది ఒకసారి చార్జ్ చేస్తే 20గంటలపాటు విలువైన కాంతిని అందిస్తుంది. ఎంత వాడినా వేడెక్కదని ఆయన తెలిపాడు. చీకటిలో సులభంగా చదవడానికి ఉపకరిస్తుందని, పైగా ఈ లైట్ వేడిగా ఉండదని చెబుతున్నాడు. ఈ మేరకు బ్రియాన్ తన ప్రోథిస్టిక్ కన్నును ఎలా రూపొందించాడో వివరిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Show comments