NTV Telugu Site icon

Crime News : పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు, ఆమె కొడుకు హత్యకు ప్లాన్‌

Mpcrime

Mpcrime

పల్నాడు జిల్లా ముప్పాళ్ళలో దారుణం చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్న మహిళతో పాటు, ఆమె కొడుకును హత్య చేసేందుకు ప్రయత్నించారు ముద్దా శ్రీను అనే వ్యక్తి.. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళతో ఈపూరు మండలం, ముప్పాళ్ళకు చెందిన ముద్ద శ్రీను గడిచిన మూడు సంవత్సరాలుగా హైదరాబాదులో సహజీవనం చేస్తున్నాడు. అయితే.. ముద్ద శ్రీను వల్ల గర్భం రావడంతో తనను పెళ్లి చేసుకోమని మహిళ ఒత్తిడి చేసింది. దీంతో మహిళ తో పాటు ఆమె కొడుకును అడ్డు తొలగించుకునేందుకు ముద్దా శ్రీను పథకం పన్నాడు. హైదరాబాద్ నుండి, సొంత గ్రామం ముప్పాళ్ళ తీసుకువచ్చి , గొంతు నులిమి చంపేందుకు, యత్నించాడని ముద్ద శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళను ,ఆమె బిడ్డను చంపి పాతి పెట్టేందుకు ముద్ద శ్రీను ముందుగానే గోతులు తవ్వి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. మహిళను హత్య చేసే క్రమంలో, కేకలు వేయడం సమీపంలో ఉన్న హైడల్ ప్రాజెక్ట్ ఉద్యోగులు వ్యవహారాన్ని పసిగట్టడంతో మహిళకు , ఆమె బిడ్డకు ముప్పు తప్పింది. హైడల్ ప్రాజెక్ట్ ఉద్యోగులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రావడంతో నిందితుడు ముద్ద శ్రీను పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.