NTV Telugu Site icon

Viral: మహిళ పర్సు దొంగిలించిన వ్యక్తి.. బస్సు తలుపులు మూసి, కర్రలతో కొట్టిన జనాలు

Viral News

Viral News

Viral: దొంగతనానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దొంగలు దొంగతనం చేసి దొరికిపోవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఓ వ్యక్తి మహిళ పర్సు లాక్కోవాలనే ఉద్దేశంతో బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన వెంటనే సదరు వ్యక్తి మహిళ పర్సు లాక్కోవడం ప్రారంభించాడు. తొలిదశలో పర్సును లాగేసుకోలేక పోయినా.. పొరపాటున పర్సుపై చేయి తగిలిందంటూ రియాక్ట్ అయ్యాడు. అయితే తొలి ప్రయత్నం చేసిన వెంటనే మళ్లీ పర్సును లాక్కునేందుకు ప్రయత్నించాడు. రెండోసారి కూడా పర్సును దొంగిలించడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తి తప్పించుకోవడానికి బస్సు డోర్ వైపు అడుగు పెట్టగానే డ్రైవర్ డోర్ లాక్ చేశాడు.

Read Also:Gold Today Price: వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

దొంగతనం చేసేందుకు ఓ దొంగ బస్సు ఎక్కినట్లు వీడియోలో చూడవచ్చు. అతనితో వచ్చిన వాడు తలుపు మూయకుండా ఆపడానికి క్రింద నిలబడి ఉన్నాడు. పర్సు లాక్కునేందుకు ప్రయత్నించిన దొంగ వెంటనే పారిపోబోయాడు. గేటు మూయకుండా ఆపేందుకు అతని సహచరుడు తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ డ్రైవర్ అప్పటికే బస్సు స్టార్ట్ చేశాడు. బస్సు డోర్ మూసిన తర్వాత దొంగ డ్రైవర్‌ని డోర్ తెరవమని అడగడం మొదలుపెట్టాడు. అయినా డ్రైవర్ వినలేదు. పైగా ఇలాంటి పనికి పూనుకున్నందుకు కర్ర అందుకుని డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ ఆ దొంగను కొట్టడం ప్రారంభించాడు. డ్రైవర్‌ చేతిలో తన్నులు తిన్న దొంగ ఏడవడం మొదలుపెట్టాడు. కొంత దూరం వెళ్లగానే డ్రైవర్ బస్సును ఆపి దొంగను పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బస్సు ఎక్కి, దొంగ చోరీకి ప్రయత్నించిన మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నారు.

Read Also:IND vs WI: అర్థశతకంతో మెరిసిన ఇషాన్ కిషన్.. తొలి వన్డేలో భారత్‌ విజయం

Show comments