NTV Telugu Site icon

Rain of Money : బెంగుళూరు రోడ్లపై డబ్బుల వర్షం

New Project (24)

New Project (24)

Rain of Money : నిత్యం రద్దీగా ఉండే రహదారి అది.. ఆఫీసుకు వెళ్తుంటే సడన్ గా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆఫీసుకు లేటవుతుందేమో.. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఉన్నట్లుండి అక్కడ అకస్మాత్తుగా నోట్ల వర్షం కురవడం ప్రారంభమైంది. అంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎక్కడినుంచి కరెన్సీ నోట్ల వర్షం కురుస్తుందా అంటూ అటు ఇటు చూశారు. ఇంతలో ఓ వ్యక్తి తన సంచిలో ఉన్న డబ్బు నోట్లను తీసి వెదజల్లడాన్ని గమనించారు. ఇదంతా బెంగుళూరు నగరంలో చోటు చేసుకుంది.

Read Also: Pawan Kalyan: బీజేపీతోనే ఉన్నా.. కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా

కేఆర్ మార్కెట్ వద్ద సిర్సి సర్కిల్ ఫ్లై ఓవర్ పైనుంచి ఓ వ్యక్తి కరెన్సీ నోట్లు జనంపైకి విసిరేశాడు. ఆ నోట్లను అందుకునేందుకు ప్రజలు పోటీలు పడ్డారు. వాహనాలు ఆపి మరీ రోడ్డుపై నోట్ల వేట సాగించారు. దాంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నోట్లు విసిరిన వ్యక్తి సూటుబూటు ధరించి మెడలో ఓ గోడ గడియారాన్ని తగిలించుకుని విచిత్ర వేషధారణతో కనిపించాడు. చేతి సంచి నిండా ఉన్న కరెన్సీ నోట్లను ఫ్లై ఓవర్ పైనుంచి వెదజల్లుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, ఆ వ్యక్తి వెదజల్లింది రూ.10 నోట్లు అని తెలుస్తోంది.

Show comments