NTV Telugu Site icon

Threat Call : ఫుల్‌గా తాగాడు.. ఫోన్‌ చేసి సీఎం ఇంటినే పేల్చేస్తా అన్నాడు

New Project (3)

New Project (3)

Threat Call : హోలీ రోజు సొంత గ్రామానికి వచ్చిన యువకుడిని బీహార్‌లో మద్యం తాగనివ్వలేదు. దీంతో నేరుగా సీఎం నితీష్‌ కుమార్‌ ప్రభుత్వ బంగ్లాను పేల్చివేస్తానని బెదిరించాడు. ఈ కేసులో అరెస్టయిన అంకిత్ కుమార్ అనే యువకుడిని పోలీసులు విచారణ అనంతరం విడుదల చేశారు. విచారణ, దర్యాప్తులో నిందితుడికి వ్యతిరేకంగా ఖచ్చితమైన క్రిమినల్ ఆధారాలు లభించకపోవడంతో కాబట్టి పోలీసులు అతన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.

పాట్నాలోని సెక్రటేరియట్ పోలీస్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకుడు మద్యం మత్తులో ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు. విచారణలో అతనికి ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదని తేలింది. వైశాలి జిల్లా లాల్‌గంజ్‌కు చెందిన అంకిత్‌ గుజరాత్‌లోని సూరత్‌లో పనిచేస్తున్నాడు. రోజూ మద్యం సేవించేవాడు. హోలీ సందర్భంగా గుజరాత్ నుండి తన గ్రామానికి చేరుకున్న అతను మద్యం సేవించకూడదని తెలుసుకున్నాడు. అలా నిషేధం విధించినందుకు ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read Also: Tigers Death: చంద్రాపూర్, మంచిర్యాలల్లో పులుల మరణాలు.. ముగ్గురి అరెస్ట్

గుజరాత్‌కు వెళ్లిన తర్వాత.. అక్కడ బాగా మద్యం సేవించి.. గూగుల్ నుంచి ఓ న్యూస్ ఛానెల్ ఫోన్ నంబర్‌ను రాబట్టినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. మద్యం మత్తులో వాడు ఏం మాట్లాడాడో తెలీదు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి నివాసంపై బాంబు పేలుళ్ల కథనం ఆయన నోటి వెంట వచ్చింది. ఈ కేసులో అతడిని అదుపులోకి తీసుకుని గుజరాత్ పోలీసులు విచారించగా.. అంకిత్ ఎంత పెద్ద నేరం చేశాడో అర్థం కాలేదు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను పరిశీలించారు. అతని స్వగ్రామం, నేర చరిత్ర గురించి ఆరా తీశారు.

Read Also: Expensive Shoe : ఇది మామూలు షూ కాదు.. దీని ధర రూ.164కోట్లు

అతని బంధువులు, సహచరులను కూడా విచారించారు. అయితే దర్యాప్తులో పోలీసులు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేదా నేర చరిత్రను కనుగొనలేకపోయారు. నిందితుడు అంకిత్‌ను గుజరాత్ పోలీసులు సూరత్‌లో అరెస్టు చేశారు. విచారణ కోసం పాట్నా పోలీసుల బృందం కూడా గుజరాత్ చేరుకుంది.