NTV Telugu Site icon

Viral Video: చిన్న కారులో పెద్ద ఎద్దు.. వాహనం ఆపి అసలు విషయం తెలుసుకున్న పోలీసులు

Bull

Bull

Viral video: అమెరికాలోని నార్ ఫోక్ పోలీసులకు ఉదయం 10 గంటల సమయంలో ఒక ఫోన్ వచ్చింది. ఎవరో ఒక వ్యక్తి ఎద్దును తన ప్యాసింజర్ కారులో ఎక్కించుకొని తీసుకువెళుతున్నాడు అని. అయితే పోలీసులు మొదట అది ఎద్దు కాదు దూడ ఏమో అందులో కారులో సరిపోయిందేమో అనుకున్నారు. అయితే కొంత దూరం తరువాత ఆ వ్యక్తిని ఆపిన పోలీసులు కారులో పొడవైన కొమ్ములతో ఉన్న ఓ భారీ ఎద్దును చూసి షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read: Panneerselvam: పన్నీర్ సెల్వంకు షాక్.. 11 ఏళ్ల తర్వాత ఆ కేసు పునర్విచారణ

ఈ వీడియోను పరిశీలిస్తే  ఓ వ్యక్తి ఒక చిన్న కారులో ఒక పెద్ద ఎద్దును ఎక్కించుకొని వెళ్లడం మనం వీడియోలో చూడొచ్చు. ఇక అది చూసిన పోలీసులు అతని కారును ఆపి దాని గురించి ఎంక్వైరీ చేయడం మనం గమనించవచ్చు. రోడ్డుపై ఎద్దును తీసుకువెళుతున్న వ్యక్తి పేరు లీ మేయర్. అతడు చాలా కాలంగా ఆ ఎద్దును పెంచుకుంటున్నాడు. దానిని ప్రతి రోజు కారులో ఎక్కించుకొని వాళ్ల గ్రౌండ్ లోనే తిప్పుతాడు. ఆ ఎద్దుపేరు హౌడీ డూడీ. అయితే హౌడీని తొలిసారి రోడ్డుపై తిప్పాడు. దాని కోసం కారును ప్రత్యేకంగా రూపొందించాడు. హౌడీ కారులో చాలా చక్కగా కూర్చుంది. దాని కొమ్ములు కారులో నుంచి బయటకు వచ్చాయి. వీడియో చూస్తుంటే అది దాని ముఖాన్ని కూడా బయట పెట్టి చుట్టూ చూస్తూ ఆనందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎద్దును బయటకు తీసుకురావడంతో ట్రాఫిక్ పోలీసులు కారును ఆపి ట్రాఫిక్ ఉల్లంఘనల విషయమై వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కారులో దూసుకెళ్తున్న ఎద్దును చూసి తాము ఆశ్చర్యపోయామని పోలీస్ అధికారి తెలిపారు.

ఇక హూడీ విషయానికి వస్తే అది వాటుసి జాతికి చెందిన ఎద్దు. వాటుసి ఎద్దులు ఒక రకమైన ఆఫ్రికన్ పశువులు. సాధారణంగా ఇవి చాలా పెద్ద కొమ్ములను కలిగి ఉండి, గంభీరంగా కనిపిస్తాయి. చూస్తేనే భయం పుట్టేలా ఉంటాయి. అయితే హూడీ బయటకు వచ్చిన ఎటువంటి ప్రమాదం జరగకుండా ఇంటికి చేరుకుంది. దీనిపై లీ మేయర్ భార్య స్పందిస్తూ తాము దానిని చాలా ప్రేమగా, కుటుంబంలో సభ్యురాలిలాగా చూసుకుంటామని తెలిపింది. అది అంటే వాళ్ల ఆయనకు ప్రాణమని, ఎన్నో ఏళ్ల నుంచి అది తమతోనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక తన భర్త దాని కోసం చాలా ఖర్చు చేస్తారని తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన వారు లీ, హూడీ చాలా మంచి ఫ్రెండ్స్. చాలా కాలం నుంచి వారు నైల్ పరేడ్ కు వస్తారు.కానీ ఎప్పుడు ఆ ఎద్దు తప్పుగా ప్రవర్తించలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.