NTV Telugu Site icon

Jaipur: కుమార్తెను కోచింగ్‎కు తీసుకెళ్తుండగా గ్యాంగ్ స్టర్ కాల్పులు.. తండ్రి మృతి

Gun Fire

Gun Fire

Jaipur: రాజస్థాన్‎లోని సికర్లో దారుణం జరిగింది. గ్యాంగ్ స్టర్ జరిపిన కాల్పుల్లో కుమార్తెను కోచింగ్ కు తీసుకెళ్తున్న తండ్రి మరణించాడు. పిప్రలి రోడ్‌లో గ్యాంగ్‌స్టర్‌ రాజు తేత్‌ను నలుగురు దుండగులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల్లో మరో వ్యక్తి కూడా మరణించగా అతడి బంధువు గాయపడ్డాడు. తారాచంద్ కద్వాసర అనే వ్యక్తి తన కుమార్తెను కోచింగ్ సెంటర్‌లో చేర్చేందుకు వెళ్లాడు. అతడి వెంట ఆయన బంధువు కూడా ఉన్నాడు. అయితే గ్యాంగ్‌స్టర్‌ రాజు తేత్‌పై కాల్పుల సందర్భంగా తారాచంద్‌, ఆయన బంధువుకు కూడా బుల్లెట్‌ గాయాలయ్యాయి. తారాచంద్‌ అక్కడికక్కడే మరణించాడు, ఈ ఘటనలో ఆయన బంధువు గాయపడ్డాడు. కాల్పులు జరిగిన చాలా కోచింగ్‌ సెంటర్లు, హాస్టళ్లు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్‌ తేత్‌ సోదరుడు హాస్టల్‌ నిర్వహిస్తున్నాడు.

Read Also: Akluz : రింకీ, పింకీ మధ్యలో అతుల్.. ట్రిపుల్స్ అదుర్స్ అంటున్న నెటిజన్లు

కాగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ రాజు తేత్‌ను తామే హత్య చేసినట్లు పేర్కొంది. ఆ గ్యాంగ్‌కు చెందిన రోహిత్ గోద్రా ఫేస్‌బుక్‌ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు. సోదరులు ఆనంద్ పాల్ సింగ్‌, బల్బీర్ బానుదా హత్యలకు ప్రతీకారం తీర్చుకునేందుకే రాజు తేత్‌ను హత్య చేసినట్లు అందులో వెల్లడించాడు. మరోవైపు కాల్పులు జరిపిన నలుగురు వ్యక్తులను గుర్తించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్‌ చేసేందుకు రాజస్థాన్‌ వ్యాప్తంగా వెతుకులాట ప్రారంభించామన్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్‌ రాజు తేత్‌ను కాల్చి చంపిన తర్వాత గన్స్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ నలుగురు దుండగులు అక్కడి నుంచి పరారు కావడం ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.