Site icon NTV Telugu

Crime news: దారుణం.. నడిరోడ్డుపై కారంచల్లి కత్తులతో పొడిచి..

Crime News

Crime News

Crime news: హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. డీఎల్‌ఆర్‌ఎల్‌ రోడ్డుపై కొంతమంది దుండగులు ఓ వ్యక్తిపై కారంచల్లి కత్తులతో పొడిచి హత్య చేశారు. సంతోష్ నగర్ నుంచి బండ్లగూడ వెళ్తుండగా.. టాటా ఏసీ ఆటోను వెంబడించి ఆటో డ్రైవర్‌పై ముగ్గురు వ్యక్తులు కారం చల్లి కత్తులతో దాడి చేసి హత్య చేశారు. స్నేహితులే హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Shraddha Walkar Case: శ్రద్ధా హత్య కేసులో కీలకంగా మారిన “వాటర్ బిల్”..

స్నేహితుల మధ్య గొడవ కాస్త మరో స్నేహితుని హత్య కు దారితీసింది. భవాని నగర్ ప్రాంతంలో నివసిస్తున్న షాకీర్(30) కొద్ది రోజుల క్రితం స్నేహితులతో గొడవ జరిగింది. స్నేహితులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version