Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man shoots girlfriend: ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఓ యువతిని గన్‌తో కాల్చి చంపి అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
26 ఏళ్ల యువకుడు తన ప్రియురాలిని కాల్చి చంపి అనంతరం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ చౌదరి అనే నిందితుడు దీప్మల యాదవ్ (24)ని నంద్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఘుక్నా గ్రామంలోని తన ఇంటి వద్ద గురవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు ఆలయానికి వెళ్లిన సమయంలో కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చి చంపాడు. ఆ తర్వాత విషం సేవించాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నగరం) నిపున్ అగర్వాల్ తెలిపారు. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిద్దరినీ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. రాహుల్ చౌదరిని ఈశాన్య ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని అధికారి తెలిపారు.
Also Read
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
Read Also: Akanksha Dubey: నా కూతురిది హత్యే.. నటి ఆకాంక్ష దూబే తల్లి ఆరోపణ
బులంద్‌షహర్ జిల్లా సేలంపూర్కు చెందిన రాహుల్ చౌదరి, తన మామ ఇంటికి వచ్చినప్పుడు ఆ గ్రామంలోని ఆ యువతిని కలిశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ చౌదరి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని, అయితే ఆ యువతి నిరాకరించిందని.. దీంతో అతడు గన్‌తో కాల్చి చంపినట్లు యువతి బంధువులు వెల్లడించారు. అసలు ఈ ఘటనకు దారి తీసిన విషయంపై విచారణ జరుపుతామని డీసీపీ తెలిపారు. నిరసనగా మహిళ బంధువులు నాలుగు గంటలపాటు రోడ్డును దిగ్బంధించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు.
తాజావార్తలు
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్‌లో రెండో సెంచరీ నమోదు..
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!