Kumuram Bheem Asifabad: భార్య మీద కోపంతో అత్తింటికి నిప్పు పెట్టాడు ఓ వ్యక్తి… ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లా పటార్‌లో చోటు చేసుకుంది. ఎల్లాపటార్‌కు చెందిన షమాబీకి జైనూర్ మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో 9 నెలల కిందట వివాహం జరిగింది. తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముజాహిద్.. షమాబీతో తరుచూ గొడవ పడేవాడు. తాజాగా ఎల్లాపాటార్ వచ్చి మళ్ళీ భార్యతో గొడవపెట్టుకున్నాడు.. గొడవ ఒక్కసారిగా పెరిగింది. దీంతో అత్తింట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ పైపు లీక్ చేశాడు. వెంటనే నిప్పటించి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Kriti Sanon: తొలి భారతీయ మహిళా నటిగా ‘కృతి సనన్’ చరిత్ర!
