Physical harassment: కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణ తాడ్కోల్ హన్ మాన్ లాడ్జ్ లో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేశాడు ఓ యువకుడు.. అయితే, ఊహించని ఘటనతో షాక్ తిన్న బాలిక ఒక్కసారిగా కేకలు వేయడంతో.. చుట్టుపక్క ప్రజలు, స్ధానికులు యువకుడికి పట్టుకొని పోలీసులకు అప్పగించారు.. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.. యితే, బాన్సువాడలోని లాడ్జిల్లో వ్యభిచార దంద జోరుగా నడుస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నా.. పోలీసులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారని మండిపడుతున్నారు. అసలు లాడ్జిలోకి స్కూల్ విద్యార్థి అయిన మైనర్ బాలికను ఎలా అనుమతించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Read Also: Asaduddin Owaisi: అద్వానీకి భారతరత్నపై స్పందించిన ఓవైసీ.. రథయాత్ర మ్యాప్‌ని పోస్ట్ చేస్తూ..
మొత్తంగా లాడ్జిలో బాలికతో మువకుడిని చూసి కంగుతిన్నారు స్థానికులు.. ఇంత జరుగుతున్నా లాడ్డీల యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పై స్థానికులు మండిపడుతున్నారు.. గతంలో లాడ్జిలో ఓ పురుషుడు, స్త్రీలు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోగా.. పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు స్థానికులు.. తర్వాత కూడా లాడ్జిలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పుడే కఠినంగా చర్యలు చేపడితే ఈ రోజు ఇలాంటి ఘటనలు జరిగేవి కాదని స్థానికులు అంటున్నారు. పోలీసులు లాడ్జిలపై చూసి చూడనట్లు వ్యవాహరిస్తున్నతీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా, ఈ సిటీలో చూసినా.. ఓ పట్టణంలో చూసినా.. లాడ్జిలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి.. బాలురు, బాలికలకు సైతం ఎలాంటి ఆంక్షలు లేకుండా కొన్ని లాడ్జీలు అనుమతించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా.. చాలా లాడ్జీలు చూసిచూడనట్టుగా వ్యవహరించడంతో.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ప్రజలు మండిపడుతున్నారు.