Urine In Juice: ఘజియాబాద్ జిల్లాలోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి కాలనీలో కొంతమంది జ్యూస్ దుకాణంలో మూత్రంలో కలిపి విక్రయిస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం అక్కడికక్కడే గుమిగూడారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా బాటిల్‌లో మూత్రం లభించింది. ఈ ఘటనలో ఓ మైనర్ సహా ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై నివేదిక నమోదు చేసి విచారణ జరుపుతున్నారు పోలీసులు.
Uttarpradesh : కారు టైర్ పగిలిపోవడంతో ఘోర ప్రమాదం.. పాన్ మసాలా కంపెనీ యజమాని భార్య మృతి
సమాచారం మేరకు లోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రపురి కాలనీలో ఖుషీ జ్యూస్ కార్నర్ పేరుతో ఓ దుకాణం ఉంది. శుక్రవారం సాయంత్రం దుకాణం వెలుపల పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దుకాణదారుడు, అతని చిరుద్యోగి జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయిస్తున్నారని ఆరోపించారు. దీంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు సంఘర్షణ వాతావరం నెలకొని ఉంది. అక్కడి ప్రజలు ఇద్దరినీ పట్టుకున్నారు. ఆ తరవాత ప్రజలు బోర్డర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు షాపులో సోదా చేయగా అక్కడ మూత్రం బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మైనర్‌తో సహా ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Water Leakage At Taj Mahal: తాజ్ మహల్ ప్రధాన గోపురం నుంచి నీరు లీకేజీ
ఇకపోతే పోలీసుల విచారణలో షాపులో, అలాగే చుట్టుపక్కల మూత్ర విసర్జన చేయడానికి స్థలం లేదని నిందితుడు చెప్పాడు. అందుకే అతడు సీసాలో మూత్రం పోసేవాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.