NTV Telugu Site icon

Viral Video: బతకడం అంత ఈజీ కాదు.. ఈ వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది

New Project (2)

New Project (2)

Viral Video: జీవితంలో ఒడిదుడుకులతో నడుస్తుంది. జీవితంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఏ సమయంలో ఏ దిశలో తిరుగుతుందో ఊహించడం కష్టం. జీవితంలో ఎన్ని కష్టాలుంటాయో.. వాటితో పాటే కొన్న సుఖాలు కూడా ఉంటాయి. బతకడం అంటే అంత ఈజీ ఏం కాదు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ జీవితాన్ని కొనసాగించాలి. మీకోసం ఈ రోజు ఓ వీడియో చూపిస్తున్నాం.. ఇది చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. జీవితం అందరికీ ఒకేలా ఉండదు. ఒక్క రూపాయి సంపాదించడానికి ప్రజలు ఎంత కష్టపడుతుంటారో. అప్పుడే పట్టెడన్నం మన నోట్లోకి వెళ్లేది. అలాంటి రూపాయి కోసం చాలా సార్లు ప్రాణాలను కూడా పణంగా పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Read Also:CM YS Jagan: పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్లపై సీఎం ఘాటు వ్యాఖ్యలు.. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్..!

ప్రజలు, ఆతురుతలో, ప్రాణాలను కూడా పణంగా పెట్టే ఇలాంటి పొరపాట్లకు తరచుగా పాల్పడడం చూసే ఉంటారు. ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టే ఈ వీడియోను ఇప్పుడు చూడండి. దీన్ని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోతారు. చివరికి ఆ వ్యక్తికి ఏమి జరిగిందో అని భయపడడం గ్యారంటీ. వైరల్ అవుతున్న వీడియోలో చాలా మంది విక్రేతలు ఆహార పదార్థాలతో కదులుతున్న రైలు పైకి ఎక్కడానికి ప్రయత్నించడాన్ని మీరు చూడవచ్చు. ఒక వైపు, ముందుగా ఒక వ్యక్తి ఆహారం ఉన్న బుట్టతో కదులుతున్న రైలు ఎక్కాడు. అతడిని చూసి నీళ్ళు అమ్మే మరో వ్యక్తి కూడా అలానే రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని బ్యాలెన్స్ తప్పుతుంది. వెంటనే అతడు పడిపోతాడు. అదృష్టమేమిటంటే పట్టాలకు దూరంగా నేలపై పడిపోవడంతో అతని బాడీ రైలు చక్రాల కిందకు పడలేదు. ఈ వీడియో addiction4success అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేయబడింది. ఇది వందల కొద్దీ లైక్‌లు, వ్యూస్ సాధించింది.

Read Also:Bhanu Prakash Reddy: ఓటమి భయం నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది: భాను ప్రకాశ్ రెడ్డి