NTV Telugu Site icon

Crime News: మద్యం మత్తులో ప్రియురాలిని చంపిన ప్రియుడు

Crime News

Crime News

Crime News: తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని చంపేశాడు. శ్రీకాళహస్తి మండలం రామలింగాపురం ఎస్టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందంటే.. పుట్టుకతో మూగ ఉన్న కాటమ్మ అనే మహిళ భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన చెంచయ్యతో ప్రేమాయణం సాగిస్తోంది. ఓ రైతు వద్ద ఇద్దరు కూలీ పనిచేస్తూ సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి మద్యం మత్తులో కాటమ్మను చెంచయ్య కర్రతో తలపై కొట్టడంతో ఆమె మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు చెంచయ్యను పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. మద్యం మత్తులో చేసినట్లు పోలీసులకు చెంచయ్య వెల్లడించాడు.

Read Also: Middle East effect: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం

Show comments