NTV Telugu Site icon

Nizamabad: ఆటో కోసం స్నేహితుడి హత్య.. అంతటితో ఆగకుండా?

Murder

Murder

Nizamabad: నిజామాబాద్‌లో ఓ యువకుడిని హత్య చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని కాల్చిన ఘోరం వెలుగుచూసింది. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆటో కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిజామాబాద్‌ బ్రాహ్మణ కాలనీకి చెందిన సందీప్ ఈనెల 15న మిస్సింగ్‌ అయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా అతని ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు తెలిపారు. దానితో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, రెండు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 17న ఇందల్వాయి అటవీ ప్రాంతంలో సందీప్‌ హత్యకు గురై మృతదేహం కాలిపోయిన స్థితిలో కనబడింది.

Read Also: Viral Video: 270 కేజీల బరువు ఎత్తబోయి ప్రాణాలు పోగొట్టుకున్న వెయిట్‌లిఫ్టర్..

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, నాగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ సతీష్‌ గౌడ్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను గతంలోనూ నేరచరిత్ర కలిగిన వ్యక్తిగా గుర్తించారు. విచారణలో నిందితుడు హత్యను అంగీకరించాడు. సందీప్ ఆటో కొనడానికి బంగారం తాకట్టు పెట్టాడు. మరుసటి రోజునే సందీప్‌ను హత్యకు గురి అయ్యాడు. హత్య అనంతరం మృతదేహాన్ని దహనం చేసి అటవీ ప్రాంతంలో వదిలేశాడు. పోలీసులు నిందితుడి వద్ద నుంచి ఆటో, సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌ హత్య కేసు ఒక్కరితో మాత్రమే సంబంధం ఉందా, లేక మరికొందరు కూడా దీనికి పాల్పడ్డారన్న కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులు దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: IND vs BAN: నేడే బంగ్లాతో టీమిండియా తొలి సమరం..

మా కుటుంబానికి న్యాయం జరగాలని, చివరి చూపు చూడకుండా మృతదేహాన్ని కాల్చేశారని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని వారు డిమాండ్ చేసారు. సందీప్‌ కుటుంబ సభ్యులు నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడికి సహకరించిన వారిపై కూడా విచారణ కొనసాగిస్తామని తెలిపారు.