NTV Telugu Site icon

Physical Harassment: మైనర్‌ కుమార్తెపై లైంగిక దాడి.. కీచక తండ్రికి పదేళ్ల జైలు శిక్ష

Harassment

Harassment

Physical Harassment: కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. కడుపున పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా నీచానికి ఒడిగట్టాడు. కన్న కూతురిపై అత్యాచారం చేసిన ఓ కసాయి తండ్రి కటాకటాల పాలయ్యాడు. మైనర్ కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన కీచక తండ్రికి ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అపరిపక్వ వయస్సు గల బాలికలతో లైంగిక కార్యకలాపాలు వారి జీవితాలపై బాధాకరమైన ప్రభావాన్ని చూపుతాయని న్యాయస్థానం పేర్కొంది. కన్న తండ్రే ఇలాంటి నేరాలకు పాల్పడితే పిల్లలపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్లు 354, 509, పోక్సో చట్టం ప్రకారం తన మైనర్ కుమార్తెపై లైంగిక వేధింపుల కేసులో తండ్రికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.

ప్రత్యేక పోక్సో జడ్జి సీమా జాదవ్ ఫిబ్రవరి 23న జారీ చేసిన ఉత్తర్వుల వివరాలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం.. 2013, 2017 మధ్య కాలంలో ఆమె తల్లి పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఆ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని ఆమెను బెదిరించాడు. నిందితుడు అపరిచితుడు కాదని, బాధితురాలి తండ్రే కాబట్టి ఆమె జీవితాంతం ఈ విషయం బాధను కలిగిస్తుంది కోర్టు పేర్కొంది. బాధితురాలి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుందని న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు, బిడ్డ నమ్మకంగా విశ్వసించగల తల్లి స్థానంలో ఉన్నాడని కోర్టు పేర్కొంది. తల్లిలాగే, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రధాన బాధ్యత అతనిపై ఉందని తెలిపింది. ఆమె నమ్మకాన్ని మోసం చేయడం కంటే దారుణంగా, అతను ఆమెను పాడుచేసి, జీవితానికి శాశ్వత మచ్చను మిగిల్చాడని కోర్టు చెప్పింది.

Read Also: Couple Stuck In Lift: లిఫ్టులో చిక్కుకున్న కొత్త జంట.. ఆ తర్వాత ఏమైందంటే?

పాఠశాల పరీక్షలో బాధితురాలి పనితీరు అద్భుతంగా ఉందని, ఇప్పటి వరకు ఆమె ఏ సబ్జెక్టులోనూ ఫెయిల్ కాలేదని డిఫెన్స్ వాదించింది. స్కూల్ ప్రాజెక్ట్‌లు, ఆర్ట్, క్రాఫ్ట్, ఇతర పోటీలలో ఆమె తండ్రి ఆమెకు సహాయం చేస్తారని డిఫెన్స్ తెలిపింది. అయితే, బాధితురాలు మూడు, ఐదో తరగతి చదువుతున్నప్పుడు రాసిన జవాబు పత్రాలకు సంబంధం లేదని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.”గాయం ఎల్లప్పుడూ చదువులో పనితీరుతో సమానం కానవసరం లేదు. ఆమె పరీక్షలో బాగా స్కోర్ చేసినంత మాత్రాన ఆమె నిందితుల చేతిలో లైంగిక వేధింపులకు గురికావడం లేదని అర్థం కాదు” అని కోర్టు పేర్కొంది.