NTV Telugu Site icon

Naveen Jindal: నవీన్ జిందాల్‌కు ఖైదీ బెదిరింపు లేఖ.. రూ. 50 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తానంటూ..

Naveen Jindal

Naveen Jindal

Naveen Jindal: ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌ను బెదిరిస్తూ లేఖ రావడం కలకలం రేపింది. రూ.50 కోట్లు ఇవ్వాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆగంతుకుడు అందులో డిమాండ్ చేశాడు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ఆ లేఖను ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ జిల్లాలోని జైలు నుంచి ఓ ఖైదీ పంపినట్లు తేలింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని జైలు నుంచి ఒక ఖైదీ రూ.50 కోట్లు డిమాండ్ చేస్తూ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ మాజీ ఎంపీ నవీన్ జిందాల్‌కు చెందిన రాయగఢ్‌లోని స్టీల్ ప్లాంట్‌కు బెదిరింపు లేఖ పంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ లేఖ గత వారం పత్రపాలి గ్రామంలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (జేఎస్‌పీఎల్) కర్మాగారానికి పోస్ట్ ద్వారా పంపినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 48 గంటల్లోగా డబ్బు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తూ వ్యాపారి రూ.50 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

Air India: విమానంలో మరో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు రూ.10లక్షల జరిమానా

బిలాస్‌పూర్ కేంద్ర కారాగారంలోని ఖైదీ లేఖ రాసినట్లు దర్యాప్తులో వెల్లడైంది, దీని తర్వాత కోత్రారోడ్ పోలీసులు సోమవారం అతనిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 386, 506 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. రూ.100కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో గల గడ్కరీ కార్యాలయానికి ఒకే రోజు రెండు ఫోన్‌కాల్స్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అనంతరం అతడు కూడా ఖైదీ అని దర్యాప్తులో తేలింది.