NTV Telugu Site icon

Delhi: అమానుషం.. వ్యక్తిని కారుతో గుద్ది బ్యానెట్ పై 3కి.మీ లాక్కెళ్లిన ఎంపీ డ్రైవర్

New Project (4)

New Project (4)

Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ ఎంపీ కారు డ్రైవర్ ఓ వ్యక్తి పట్ట అమానుషంగా ప్రవర్తించాడు. తన వాహనాన్ని ఎందుకు గుద్దుతున్నావని అడిగిన పాపానికి తనపైకి కారును ఎక్కించేందుకు యత్నించాడు. తన ప్రవర్తన చూసి అప్రమత్తమైన వ్యక్తి ఎంపీ కారు బానెట్కి ఎక్కాడు. అలాగే ఆపకుండా దాదాపు 2-3 కిలోమీటర్ల వరకు కారును పోనిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. ఆదివారం రాత్రి చేతన్ అనే వ్యక్తి ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ దర్గాకు వెళ్తున్నాడు. అదే సమయంలో బీహార్ ఎంపీ చందన్ సింగ్ కాన్వాయ్ కు చెందిన కారు అదే రహదారిలో ప్రయాణిస్తుంది.

Read Also:Black magic: జగిత్యాల జిల్లాలో క్షుద్రపూజలు కలకలం.. స్కూల్ కారిడార్‌లో వింత పూజలు

ఎంపీ కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు.. చేతన్ వాహనాన్ని పదే పదే ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఎందుకలా చేస్తున్నావని నిలదీశాడు. దీంతో రెచ్చిపోయిన సదరు డ్రైవర్ అతనిపైకి కారును ఎక్కించే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన చేతన్ కారు బానెట్ పైకి ఎక్కాడు. అయినా వెనక్కి తగ్గని డ్రైవర్ కారును 2-3 కిలోమీటర్లు పోనిచ్చాడు. ఆపమని బాధితుడు ఎంత వేడుకున్నా ఏ మాత్రం జాలి చూపలేదు. గస్తీలో ఉన్న పోలీసులు బానెట్ పై మనిషి ఉండటాన్ని చూసి సదరు కారును వెంబడించి ఆపారు. బాధితుడు చేతన్ జరిగిన విషయం చెప్పడంతో అతని ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ చందన్ సింగ్ కారులో లేరని డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

Future of Jobs 2023: వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాల్లో కోత విధించే ఛాన్స్