Sunflower Sarming: 50వ పెళ్లి రోజు.. భార్యకు 80 ఎకరాల్లో పండించిన 12 లక్షల పొద్దుతిరుగుడు పువ్వులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunflower Sarming: పెళ్లి రోజు సందర్భంగా ప్రజలు తమ జీవిత భాగస్వామికి అందమైన బహుమతులు ఇస్తారు. వాటికి ఖర్చుతో పట్టింపు లేదు.. కానీ హృదయం నుండి ఇచ్చిన బహుమతులు అలాంటి సందర్భాలలో మనసుకు సంతోషపరుస్తాయి. ఇది ప్రేమను వ్యక్తపరిచే మార్గం. అయితే రీసెంట్ గా ఓ వ్యక్తి తన 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఏం చేసాడో చూస్తే.. ఈ వ్యక్తి తన భార్యను ఎంతలా ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది.
80 ఎకరాల్లో 12 లక్షల పొద్దుతిరుగుడు పూలు
అమెరికన్ రైతు లీ విల్సన్ తన భార్య రెనీ కోసం చేసిన పని అసాధారణమైనది. లీ విల్సన్ తన భార్య రెనీకి తన 50వ వివాహ వార్షికోత్సవంలో కనులవిందుగా నిలిచే బహుమతిగా పొద్దుతిరుగుడు పువ్వులను పెంచాడు. ఇప్పుడు దానిలో అసాధారణం ఏముందని అనుకుంటున్నారా? అతడు పెంచింది ఇంట్లో కాదు.. దాదాపు 80 ఎకరాల భూమిలో ఈ పువ్వులను పెంచాడు.. వాటి ద్వారా వచ్చిన సంఖ్య 12లక్షలకు పైగా ఉంటుంది.
Also Read
- Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
- Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
- Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
- TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
Read Also:Ramulu Naik : ఆర్టీసీపై కేసీఆర్‌ది ఎన్నికల కపట ప్రేమ
విరగకాచిన తోట
తన భార్య పొద్దుతిరుగుడు పువ్వులను ఎంతగా ప్రేమిస్తుందో లీకి బాగా తెలుసు. రెనీకి పొద్దుతిరుగుడు పువ్వుల గుత్తిని ఇవ్వడానికి బదులుగా.. అతను మొత్తం తోటను బహుమతిగా ఇచ్చాడు. లీ తన కొడుకు సహాయంతో మేలో పువ్వులు నాటాడు. వారి వార్షికోత్సవం వరకు తన భార్య నుండి తోట విషయాన్ని రహస్యంగా ఉంచాడు.
ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది?
పొద్దుతిరుగుడు పువ్వులు పూర్తిగా వికసించినప్పుడు.. ఆమె ఇష్టమైన ప్రకాశవంతమైన పసుపు పొద్దుతిరుగుడు పువ్వులతో అలంకరించబడిన విశాలమైన పొలాల ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూడటానికి ఆమెను ఆహ్వానించడం ద్వారా అతను తన భార్యను ఆశ్చర్యపరుస్తాడు. లీ తనకు అలాంటి ఆశ్చర్యకరమైన ఆలోచన ఎలా వచ్చిందో చెప్పాడు. 50 ఏళ్ల నుంచి నా భార్య నాతో ఉంటోందని, అందుకే సంబరాలు చేసుకుంటున్నానని చెప్పాడు. ఆమె ఎప్పుడూ పొద్దుతిరుగుడు పువ్వులను ఇష్టపడతాడు.. కాబట్టి నేను వాటిని 80 ఎకరాలలో పెంచానని చెప్పాడు.
Read Also:Malli Pelli Movie: నరేష్ ‘మళ్లీ పెళ్లి’కి లైన్ క్లియర్.. రమ్య రఘుపతిపై నిషేధం!
‘నాకు ఇంతకంటే మంచి బహుమతి లభించలేదు’
షాకింగ్ గురించి రెనీ మాట్లాడుతూ.. ఇది నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. నేను పొద్దుతిరుగుడు పొలం కంటే గొప్ప వార్షికోత్సవ బహుమతిని అడగలేను రెనీ, లీ ప్రేమకథ.. వారు కేవలం 16 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు హైస్కూల్లో ప్రారంభమైంది. అప్పటి నుండి కలిసి ఉన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
-
Delhi: పెళ్లి చేసుకోవాలని ఇన్ఫ్లుయెన్సర్ ఇంట్లోకి చొరబడ్డ యువకుడు.. కొట్టి చంపిన బంధువులు.
-
TTD: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ముగింపు.. లక్షల్లో దరఖాస్తులు..
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!