Site icon NTV Telugu

Accident Viral Video: భూమ్మీద ఇంకా నూకలున్నాయి కాబోలు.. ఎన్ని సార్లు తప్పించుకున్నాడో

Accident

Accident

Accident Viral Video: రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటు వహించినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు సైతం రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నాయి. బైక్స్, వాహనాలు నడిపే సమయంలో మాత్రమే కాదు.. రోడ్డుపై నడుస్తున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రమేయం లేకున్నా.. ఇతరుల తప్పిదాల వల్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి . ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి చాలా వైరల్ అవుతోంది.

Read Also: Farmers Arrested : ఆ పంట వేశారని మణిపూర్‌లో 700 మంది రైతుల అరెస్ట్

ఈ వీడియో చూశాక వీడికి ఇంకా భూమ్మీద నూకలున్నాయి అనిపించక మానదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయినట్లు ఉంది.. కొంచెం దూరంలో వాహనాలన్నీ ఆగి ఉన్నాయి. ఇంతలో వ్యక్తి రోడ్డుపై పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు ఒక కారు స్పీడుగా వచ్చింది. సడన్ గా కారు రావడంతో అతను రోడ్డుమీద అడ్డంగా పడిపోయాడు. వెంటనే తప్పించుకునేందు ప్రయత్నించాడు. ఆ వెంటనే ఇంకో కారు దూసుకొచ్చింది. దాని నుంచి తప్పించుకుని లేచి పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఆ వెనువెంటనే కార్లు వస్తుండడంతో వాటిని దాటుకుంటూ వెళ్లాడు. ఈ సమయంలో కార్లన్నీ ఒకదాని వెనుక ఒకటి ఢీకొట్టుకున్నాయి. వీటన్నింటినుంచి అతి కష్టం మీద అతను తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అదే సమయంలో.. వీడియోలో ఎటువంటి కారణం లేకుండా చాలా వాహనాలు ఢీకొన్నాయి.

Exit mobile version