NTV Telugu Site icon

Andhra Pradesh: మరో ప్రాణం తీసిన ఫ్రిజ్‌.. పాల కోసం ఫ్రిజ్‌ డోర్‌ పట్టుకొని వ్యక్తి మృతి

Fridge

Fridge

Andhra Pradesh: ఈ మధ్య ఫ్రిజ్‌ పట్టుకుంటే కరెంట్‌ షాక్‌తో ప్రాణాలు పోతున్నాయి.. ఈ నెలలో నిజామాబాద్‌ జిల్లాలో ఫ్రిజ్‌ పట్టుకున్న విద్యుత్‌ షాక్‌తో చిన్నారి మృతిచెందిన ఘటన మరువక ముందే.. అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గంగవరంలో ఇంట్లోని ఫ్రిజ్ లో ఉన్న పాలు తీసుకోవడానికి ఫ్రిజ్ డోర్ పట్టుకున్నాడు బాషా అనే వ్యక్తి.. దీంతో.. ఒక్కసారిగా విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు.. వెంటనే కుటుంబ సభ్యులు బాషాను ఆస్పత్రికి తరలించిన ఉపయోగం లేకుండా పోయింది.. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

Read Also: Bank Holidays : నవంబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులంటే?

కాగా, ఈ మధ్యే ఐస్‌క్రీం కావాలని మారాం చేసి తండ్రిని షాపింగ్‌ మాల్‌కు తీసుకెళ్లిన చిన్నారి.. అక్కడి ఫ్రిజ్‌ లో ఉన్న ఐస్‌క్రీం తీసుకునే ప్రయత్నంలో భాగంగా.. ఫ్రిజ్‌ను పట్టుకుని విద్యుదాఘాతంతో మరణించిన విషాదకర ఘటన నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌లో ఈ నెలలోనే జరిగింది.. బోధన్‌ నియోజకవర్గం నవీపేటకు చెందిన గూడురు రాజశేఖర్‌ నందిపేట్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లాడు.. అయితే, అతని కుమార్తె నాలుగేళ్ల రిషిత ఐస్‌క్రీం కావాలని మారాం చేసింది.. దీంతో.. నందిపేట్‌లోని ఎన్‌మార్ట్‌ మాల్‌కు వెళ్లారు.. తండ్రి ఒక ఫ్రిజ్‌లో వస్తువులు చూస్తుండగా.. మరో ఫ్రిజ్‌ను తెరిచేందుకు రిషిత దాని డోర్‌ను పట్టుకోవడం.. విద్యుదాఘాతానికి గురై అక్కడే బిగుసుకుపోయి ప్రాణాలు విడిచింది ఆ చిన్నారి.. ఇప్పుడు అనంతపురం జిల్లాలోమరో ఘటన చోటు చేసుకోవడంతో.. ఫ్రిజ్‌లను పట్టుకుంటే కరంట్‌ షాక్‌ ఎలా కొడుతుంది అనే ఆందోళన మొదలైంది.