Site icon NTV Telugu

Cricketer Died: సిక్స్ కొట్టి కుప్పకూలిన యువకుడు.. గుండెపోటుతో మృతి

Cricketer

Cricketer

గుండెపోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, నిత్యం వ్యాయామం చేసే వాళ్లు సైతం హార్ట్ ఎటాక్ బారిన పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు ఎంతో ఎనర్జెటిక్ గా బ్యాటింగ్ చేసిన అతడు క్షణాల్లోనే కుప్పకూలి ప్రాణాలు ఒదిలాడు. ఈ విషాద ఘటన పంజాబ్‌ – ఫిరోజ్‌పూర్‌లోని గురుహర్ సహాయ్ పట్టణంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

Also Read:Rule Change From 1st July: జూలై 1 నుంచి కొత్త రూల్స్.. ఏమేం మారనున్నాయంటే?

గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న ఓ యువకుడు సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత పిచ్ మధ్యలోకి వచ్చాడు. ఏమైందో ఏమో చూస్తుండగానే మోకాళ్లపై కూర్చుని, ఆపై కిందపడ్డాడు. వెంటనే గ్రౌండ్ లోని ఆటగాళ్లు అక్కడికి చేరుకుని సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హర్జిత్ సింగ్ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడిని ఫిరోజ్‌పూర్‌లోని DAV స్కూల్ మైదానంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న హర్జీత్ సింగ్‌గా గుర్తించారు. ఆట కోసం వెళ్లిన కుమారుడు గుండెపోటుతో మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version