Grenades House: ఇంటికి లైట్లు పెట్టుకుంటారు.. కానీ వీడు చుట్టూ గ్రెనేడ్లు పెట్టుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Grenades House: అందరికీ వారి ఇంటిని అలంకరించడం అంటే ఇష్టం. కొందరు తమ ఇంటిలోని వివిధ గదుల కోసం రకరకాల వస్తువులను కొనుగోలు చేసి తమ టేస్ట్ కు తగ్గట్లు అందంగా అలంకరించుకుంటారు. కుండీలు, ఫోటో ఫ్రేమ్‌లు, వాల్ హ్యాంగింగ్‌లు, ఫ్యాన్సీ క్రాకరీ, ల్యాంప్స్, శిల్పాలతో డెకరేట్ చేస్తారు. అయితే, ఒక వ్యక్తి అందరి కంటే వెరైటీగా ఆలోచించాడు. తన ఇంటిని గ్రెనేడ్‌లతో అలంకరించాడు. కానీ అవి పనిచేసేవని గ్రహించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రప్పించి లైవ్ గ్రెనేడ్‌లను తొలగించారు. విస్తూపోయే ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. సమ్మర్‌కోర్ట్‌లోని కార్న్‌వాల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి అలంకరణ కోసం మూడు హ్యాండ్ గ్రెనేడ్‌లను కొనుగోలు చేశాడు. ఇంట్లోని ఒక చోట వాటితో డెకరేట్ చేశాడు.
Read Also: Chinese spy balloon: కలకలం సృష్టించిన బెలూన్ను కూల్చేసిన అమెరికా
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
కాగా, జనవరి 31న రొటీన్ తనిఖీల సందర్భంగా ఆ ప్రాంత పోలీసులకు ఈ విషయం తెలిసింది. ఆ వ్యక్తి ఇంట్లో అలంకరించినవి లైవ్ గ్రెనేడ్లు అని గుర్తించి షాకయ్యారు. వాటిని తొలగించేందుకు రాయల్ నేవీకి చెందిన ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ బృందాన్ని రప్పించారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఆ ఇంటి సమీపంలోని రోడ్డును మూసివేశారు. అలాగే సేఫ్టీ కోసం పొరుగు ఇంట్లోని వారిని కూడా ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం అన్ని జాగ్రత్తలు తీసుకుని మూడు లైవ్ గ్రెనేడ్‌లను ఆ ఇంటి నుంచి తొలగించింది. వాటిని దూరంగా తీసుకెళ్లి నిర్వీర్యం చేసింది. మరోవైపు ఇంటి అలంకరణ కోసం కొనుగోలు చేసిన గ్రెనేడ్లు పేలేవి అన్న సంగతి తనకు తెలియదని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీస్ అధికారి వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!