NTV Telugu Site icon

Guinness Record: వీడు మామూలోడు కాదు.. గడ్డంతో గిన్నీస్ రికార్డ్

Bread

Bread

Guinness Record: ప్రస్తుతం యూత్ అంతా ఫుల్ గడ్డంతో కనిపించేస్తున్నారు. ఇప్పుడదంతా ఓ స్టైల్.. ఆడవారు స్టైల్స్ విషయంలో జుట్టుకు ఎంత ఇంపార్టెంట్స్ ఇస్తారో ఇప్పుడు మగవారు గడ్డానికి ఇస్తున్నారు. గడ్డం బాగా పెరిగేందుకు ప్రత్యేకంగా క్రీములు వాడుతున్నారు. ఎదుటి వారికంటే అందంగా ఉండేందుకు వివిధ రకాల స్టైల్స్ ను ఫాలో అవుతున్నారు. అలాగే, అమెరికాలోని ఇడాహోకు చెందిన జోయల్‌ స్ట్రాసర్‌ అనే వ్యక్తి తన గడ్డాన్ని అపురూపంగా పెంచుకుంటున్నాడు. నిత్యం ఎంతో అందంగా అలంకరించుకుంటాడు.

Read Also : Corona BF-7 : చైనాలో చేతులెత్తేసిన డాక్టర్లు.. వైద్యం చేయలేక కుప్పకూలిన వైనం

గడ్డం ఆరోగ్యం కోసం ఎన్నో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు. రికార్డులు సృష్టించడంతో గడ్డం అడ్డం కాదని, అదే గడ్డంతో నాలుగు గిన్నిస్‌ రికార్డులు కొట్టేశాడో అమెరికా వాసి. ఈయన మొత్తం తొమ్మిది గిన్నిస్‌ రికార్డులను సొంతం చేసుకోవడం విశేషం. గత మూడేండ్లుగా వరుసగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సాధిస్తున్న జోయల్‌ స్ట్రాసర్‌.. తాజాగా 710 బబుల్స్‌తో తన రికార్డును మరోసారి బద్దలు కొట్టాడు. తొలిసారి 2019 లో 302 బబుల్స్‌తో గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కిన స్ట్రాసర్‌.. మరుసటి ఏడాది 542 బబుల్స్‌తో.. 2021 లో 686 బబుల్స్‌లో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. క్రిస్మస్‌ వేళ తన గడ్డాన్ని క్రిస్మస్‌ చెట్టుకు అలంకరించే వస్తువులతో అందంగా తీర్చిదిద్ది నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు.

Show comments