NTV Telugu Site icon

Viral : జాతీయ జెండాతో చికెన్‌ను శుభ్రపరిచిన వ్యక్తి, అరెస్ట్

New Project (4)

New Project (4)

Viral : జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఓ వ్యక్తి జాతీయ జెండాతో చికెన్ ను శుభ్రపరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. ఈ వీడియో కాస్త ఉన్నతాధికారులకు చేరడంతో విషయం సీరియస్ అయింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దాద్రా నాగర్ హవేలీలోని సిల్వస్సాకు చెందిన మహమ్మద్ సైఫ్ ఖురేషీ అనే వ్యక్తి చికెన్ షాప్ లో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు జాతీయ జెండాతో చికెన్ ను శుభ్రపరిచాడు. దీన్ని అటుగా వెళ్తున్న వ్యక్తి గమనించి తట్టుకోలేక ఫోన్ లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించాడు. ఆపై సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.

Read Also : Amit Shah : అమిత్ షా పర్యటనలో మార్పులు, ఆర్ఆర్ఆర్ టీమ్‌తో భేటీ రద్దు

అంతే, వీడియో వైరల్ అయ్యింది. సైఫ్ చర్య పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. నెటిజన్లు భగ్గుమన్నారు. సైఫ్ చేసిన పనిని తప్పుపట్టారు. జాతీయ పతాకాన్ని అవమానించిన అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. దీనిపై పెద్ద చర్చ లేవనెత్తడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. జాతీయ గౌరవానికి భంగం కలిగించినందున అతడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం ఆ వ్యక్తిని జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు మున్సిపాలిటీ అధికారులు సైతం చర్యలు తీసుకున్నారు. ఆ చికెన్ షాప్ కి సీల్ వేశారు.

Read Also : Sabitha Indrareddy: తెలంగాణకు ఏం చేశారని చేవెళ్లలో సభ పెడుతుండ్రు..

జాతీయ జెండాను బహిరంగ ప్రదేశంలో లేదా మరేదైనా ప్రదేశంలో కాల్చడం, అపవిత్రం చేయడం, ధ్వంసం చేయడం లేదా తొక్కడం వంటి వాటికి సంబంధించిన జాతీయ గౌరవ అవమానాల నిరోధక చట్టంలోని సెక్షన్ 2 కింద వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరం రుజువైతే, అతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని పోలీసులు వెల్లడించారు.

Show comments