NTV Telugu Site icon

Shami: షమీ 7 వికెట్లు తీస్తాడని కలలో ముందే ఊహించా.. వైరల్ అవుతున్న ట్వీట్

Shami

Shami

ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‌లో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దాదాపు అందరు ఆటగాళ్ల ఆటతీరు బాగానే ఉన్నప్పటికీ.. జట్టును గెలిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది నలుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. అందులో శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ షమీ ఉన్నారు. ప్రపంచ కప్ చరిత్రలోనే తొలిసారి ఒకే మ్యాచ్ లో 7 వికెట్లు తీసిన బౌలర్ గా మహమ్మద్ షమీ రికార్డ్ సృష్టించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా షమీపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

Read Also: Amazon: తన మొదటి స్పోర్ట్స్‌ ఛానెల్‌ను ప్రారంభించిన అమెజాన్‌ ప్రైమ్

ఇదిలా ఉంటే.. షమీ 7 వికెట్లు తీస్తాడని ముందే ఊహించిన వ్యక్తి సెమీఫైనల్‌కు ముందు చేసిన ట్వీట్ చాలా చర్చనీయాంశమైంది. ట్విట్టర్‌లో @DonMateo_X14 అనే వినియోగదారుడు నవంబర్ 14న ట్వీట్ చేశాడు. ‘సెమీ-ఫైనల్స్‌లో షమీ 7 వికెట్లు పడగొట్టిన కల చూశాను’ అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో వైరల్‌గా మారింది. 1.8 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. తదుపరి ప్రపంచకప్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకోవడంపై మాటియో కలలు కనాలని నెటిజన్లు కోరుతున్నారు. అయితే ఈ ట్వీట్ పై ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారు. ‘నా భవిష్యత్తు కూడా చెప్పండి’ అని ఒకరు, ‘ఫైనల్‌కు ముందు బాగా నిద్రపోండి’ అని మరొకరు చెబుతున్నారు.

Read Also: Cyclone Midhili: 24 గంటల్లో బంగాళాఖాతంలో “మిధిలి తుఫాన్”..

నవంబర్ 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే క్రికెట్ అభిమానులు ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా.. ఈసారి ప్రపంచ కప్ భారతదేశానికి వస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

Show comments