Site icon NTV Telugu

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సీఎం కావాలి..

Sachin Cm

Sachin Cm

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను భవిష్యత్ లో సీఎంగా చూడాలని మహారాష్టలోని పుణెకు చెందిన ఓ ఐస్ క్రీం వ్యాపారి ఆశ పడుతున్నాడు. అంతేకాకుండా సచిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని వినూత్నంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు. ఇందుకోసం తాను వ్యాపారం చేస్తున్న స్థలాన్నే ఎంచుకున్నాడు. పుణులోని ఎరవాడ ప్రాంతానికి చెందిన వినోద్ మోరే కుటుుంబంతో కలిసి 30 సంవత్సరాలుగా ఐస్ క్రీం వ్యాపారం చేస్తున్నాడు. అయితే వినోద్ కు.. సచిన్ టెండూల్కర్ ను మహారాష్ట్రకు కాబోయే సీఎంగా చూడాలని కోరిక అందుకోసం ప్రచారం చేస్తున్నాడు. దీంతో భాగంగానే తన దుకాణం రూపురేఖలను పూర్తిగా మార్చేశాడు. ఇతడి షాప్ ను చూస్తే.. ఇది ఐస్ క్రీం దుకాణమా లేక సచిన్ ఫోటో మ్యూజియమా అనిపించక మానదు.. అంతలా తన దుకాణాన్ని సచిన్ బ్యానర్లు, ఫ్లేక్సీలతో నింపేశాడు.

Also Read : Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర..నేటి రేట్లు ఇవే

తన షాప్ చుట్టూ సచిన్ ఫోటోలే కాకుండా సచిన్ సీఎం కావాలని చేపట్టిన బహిరంగ ప్రచారాల్లో పాల్గొన్న వ్యక్తుల ఫొటోలను కూడా అతికించాడు. అలాగే ఈ ప్రచారానికి సంబంధించిన తన కస్టమర్ లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ఓ డైరీని కూడా అందుబాటులో ఉంచాడు. ఇందులో భిన్న రకాల అభిప్రాయాలను చూడవచ్చు. మహారాష్ట్రలో 2019 తర్వాత ప్రభుత్వాలు మారాయి. రాష్ట్రంలో నెలకొన్న పొలిటికల్ డ్రామాతో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలు వేసిన ఓట్లను పరిగణలోకి తీసుకోవడం లేదని వినోద్ మోరే భావించాడు. ఈ కారణంగానే భవిష్యత్ లో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాలన చేసే నాయకుడే ముఖ్యమంత్రిగా రావాలనీ.. ఆ సత్తా కేవలం ఒక్క క్రికెటర్ సచిన్ కి మాత్రమే ఉందని అంటున్నాడు. వినోద్ ఇందుకోసమే ఐదు నెలల క్రితమే సచిన్ టెండూల్కర్ కాబోయే సీఎం అంటూ ప్రచారం చేస్తున్నాడు.

Also Read : SriRama Navami: తెలుగురాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు

Exit mobile version