NTV Telugu Site icon

Man Attack on Shopkeeper : దోశ వేయలేనన్న మహిళపై దాడి..

Girl Attacked

Girl Attacked

రోజు రోజుకు మానవత్వం అనేది ఉందా అనే సందేహం కలుగుతోంది. టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న ఓ మహిళపై దాడి చేశాడో దుర్మార్గుడు. టిఫిన్‌ సెంటర్‌ సమయం ముగియడంతో దోసెలు చేయలేనని మహిళ చెప్పడంతో కొడవలితో దాడి చేశాడు. నిందితుడు రామాయంపేట పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన మెట్టు స్వామి (38)గా గుర్తించారు. అయితే.. ఈ దాడిలో బాధితురాలు వీరమణి అనే మహిళ తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో చేతికి స్వల్ప గాయాలయ్యాయి. రామాయంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి గురువారం బీసీ కాలనీలోని టిఫిన్ సెంటర్‌లోకి వెళ్లి దోసె ఆర్డర్ ఇచ్చాడు.

Also Read : Bholaa Shankar: ‘భోళా శంకర్’కి బాధ్యతలు పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి

అయితే ఆరోజు దోసె పిండి అయిపోయిందని వీరమణి చెప్పడంతో ఆగ్రహానికి గురై పక్కనే ఉన్న తన ఇంట్లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి.. కొడవలితో తిరిగి వచ్చి ఆమెపై దాడి చేసి దుర్భాషలాడుతూ బెదిరించాడు. దీంతో.. వీరమణి కొడుకు ఆమెను రక్షించడానికి వచ్చినప్పుడు, స్వామి అతనిని కూడా బెదిరిస్తూ.. దుర్భాషలాడాడు. అయితే.. స్థానికులు ఇదంతా గమనించి స్వామిని వారించడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Church Pastor : పాస్టర్ రాసలీలలు.. చర్చికి భార్య, పిల్లలతో రావాలంటే భయమేస్తుందంటున్న గ్రామస్తులు