Ganja : సులభంగా డబ్బు డబ్బు సంపాదన కోసం ఇంటి వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే తరహాలో ఒక వ్యక్తి తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కల పెంపకం చేపట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు . వివరాల్లోకి వెళ్ళితే సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో లోని శాయంపేట ప్రాంతంలో నివాసం వుంటున్న అట్ల వెంకట నర్సయ్య (72), వ్యవసాయంకూలీగా పనిచేస్తూనే మరింత సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.
RG Kar Case: ఆర్జీ కర్ అత్యాచారం కేసులో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కి బెయిల్..
ఇది కోసం వెంకట నర్సయ్య తన ఇంటి పెరట్లో ఐదు అడుగుల గంజాయి మొక్కలు పెంపకం చేపట్టి వాటిలో కొన్ని మొక్కలను ఎండబెట్టి విక్రయించేందుకు సిద్దమైనాడు. నిందితుడు గంజాయి మొక్కలను పెంపకం చేపట్టినట్లుగా యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం కు సమాచారం రావడంతో ఇన్స్ స్పెక్టర్ సురేష్, ఆర్. ఐ శివ కేశవులు గంజాయి పెంపకం చేస్తున్న ఇంటిలో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ బృందం తనిఖీ చేయడంతో ఇంటి పెరట్లో గంజాయి మొక్కను గుర్తించి. సదరు మొక్కలను పెంపకం చేపట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీసులకు అప్పగించడమైంది. నిందితుడి పై పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ తనిఖీల్లో ఆర్. ఎస్.ఐలు పూర్ణ, మనోజ్,నాగరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Botsa Satyanarayana: అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభుత్వం తొందరపాటు చర్య!