Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో దారుణం జరిగింది. ఓ పొలంలో చెట్టు నుంచి జామకాయను కోసినందుకు ఓ వ్యక్తిని కొట్టి చంపేశారు. బహిరంగ మలవిసర్జనకు వెళ్లిన ఓం ప్రకాష్.. అనంతరం ఓ పొలంలో జామకాయను చెట్టు పైనుంచి తెంపుకోగా.. ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారని అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు.
Bypoll Results 2022: ఉపఎన్నికల్లో సత్తాచాటిన బీజేపీ.. ఉనికిని నిలుపుకున్న ఆర్జేడీ, శివసేన
“వారు నా సోదరుడిని కనికరం లేకుండా కర్రతో కొట్టారు. అతను స్పృహ కోల్పోయాడు. నేను అతన్ని తిరిగి తీసుకువచ్చాను, కానీ చాలా ఆలస్యం అయింది.” అని మృతుడి సోదరుడు సంత్ ప్రకాశ్ పోలీసులకు తెలిపాడు. తమకు న్యాయం కావాలని ఆయన డిమాండ్ చేశారు. అలీఘర్‌లోని గ్రామంలో ఘర్షణ జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసు అధికారి అభయ్ కుమార్ పాండే తెలిపారు. తాను వెంటనే పోలీసు బృందాన్ని పంపించానని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని అధికారి తెలిపారు.