Site icon NTV Telugu

Kalam kaval : రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘మమ్ముట్టి’ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కాలంకవాల్

Mummotty

Mummotty

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం కాలంకవాల్. జితిన్ కె. జోస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తో బాక్సాఫీస్ వద్ద  భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రం ‘కాలంకవాల్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది.

Also Read : Tylor Chase : ఒకప్పుడు హాలీవుడ్ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ .. ఇప్పుడు బిచ్చగాడు

విడుదలై 17 రోజులు పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ₹80 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ మలయాళంలో 2025లో ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో 5వ అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. పెద్ద కమర్షియల్ హంగులు లేకపోయినా, బలమైన కథ, ఎమోషనల్ కనెక్ట్ మరియు పాజిటివ్ టాక్ ఈ సినిమాకు ఇంతటి భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ముఖ్యంగా కేరళ మరియు ఓవర్సీస్ మార్కెట్లలో కాలంకవాల్  భారీ వసూళ్లు రాబడుతోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో ఈ చిత్రంఇటీవల వచ్చిన ప్రణవ్ మోహన్ లాల్ సూపర్ హిట్ చిత్రం  ‘Dies Irae’ వసూళ్లను అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఈ సినిమా ఈ ఏడాది 4వ అతిపెద్ద గ్రాసర్‌గా మారడం దాదాపు ఖాయమే అని ట్రేడ్ టాక్. ఇదే ట్రెండ్ కొనసాగించి మమ్ముట్టి కెరీర్‌లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన ‘భీష్మ పర్వం’ ను బీట్ చేస్తుందేమో చూడాలి.

Exit mobile version