Site icon NTV Telugu

Mammootty: అనారోగ్యంపై ఫస్ట్ టైం రియాక్ట్ అయిన అగ్రహీరో.. అసలు ఏమైందో తెలుసా!

Mammootty

Mammootty

Mammootty: విభిన్న కథలను సెలెక్ట్ చేసుకుంటూ, ప్రత్యేక పాత్రలకు ఓకే చెబుతూ.. భాష సరిహద్దులను చెరిపేస్తూ ప్రేక్షకులను తన చిత్రాలతో అలరిస్తున్న అగ్రకథానాయకుడు మమ్ముట్టి. నిజానికి ఈ స్టార్ హీరో పలు హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సినిమా షూటింగ్స్‌కు కొన్ని నెలలు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాటి నుంచి పూర్తిగా రికవర్ అయ్యి తిరిగి తన సినిమా షూటింగ్‌లతో బిజీ అయ్యారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఫర్ ది ఫస్ట్ టైం తన హెల్త్‌ గురించి రియాక్ట్ అయ్యారు. ఇంతకీ ఈ స్టార్ హీరో తన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఏం చెప్పారో తెలుసా..

READ ALSO: Epstein Files: ఎప్‌స్టీన్ భవనంలో అమ్మాయిలతో నోబెల్ సైంటిస్ట్.. ఆయన ఆవిష్కరణ వైద్యశాస్త్రంలోనే అద్భుతం..

ఈ ఇంటర్వ్యూలో మమ్ముట్టి మాట్లాడుతూ.. తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో రుచి, వాసన కోల్పాయనని వెల్లడించారు. తాను చాలాకాలం రుచి, వాసన కోల్పోయానని, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తెలుసుకోగలుతున్నానని చెప్పారు. నిజంగా రుచి, వాసనలను కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ అర్థం అవుతుందన్నారు. లాస్ట్ ఇయర్ జూన్‌లో మమ్ముట్టి అనారోగ్యానికి గురైనట్లు పలు వార్తలు వచ్చాయి. అసలు ఈ స్టార్ హీరోకి ఆ టైంలో ఏమైంది అనేది అధికారికంగా వెల్లడించలేదు. ఈ అనారోగ్య వార్తలు బయటికి వచ్చిన తర్వాత ఆయన సుమారుగా 4 నెలల పాటు సినిమా షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఆయన ప్రస్తుతం మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం తెరకెక్కుతున్న ‘పేట్రియాట్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయనతో పాటు మోహన్‌లాల్‌, ఫహాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

READ ALSO: Vishnu Vinyasam Teaser: శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’ టీజర్ మామూలుగా లేదుగా!

Exit mobile version