జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితిక్ష మర్డర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమయ్యయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా చిన్నారి పిన్ని క్రూరత్వం బయటపడింది. బాలిక పిన్ని మమతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి.. మమతకు రిమాండ్ విధించారు.. దీంతో మమతను పోలీసులు జైలుకు తరలించారు.
పక్కింటిలో బాలిక హితిక్షను హత్య చేసి పిన్ని మమత ఏమీ తెలియనట్లు డ్రామా ఆడినట్లు పోలీసులు తెలిపారు.
Also Read:Fake Currency: ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు.. 735 నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం
ఆడుకోవడానికి వెళ్లిన బాలికను పక్కింట్లోకి తీసుకెళ్లిన పిన్ని బాత్రూంలో చంపేసింది. బాలిక తల్లిపై ఉన్న అసూయతోనే హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. బాలిక తండ్రి సంపాదనతో పాటు బాలిక తల్లి పైన అసూయతోనే హత్య చేసినట్లు తేలింది. గత కొద్ది రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో మమత కొట్టుమిట్టాడుతోంది. ఆన్లైన్లో బెట్టింగ్ ఆడి లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్లు తేలింది. ఒకవైపు డబ్బులు లేకపోవడం.. మరొకవైపు బాలిక తల్లి తనను చిన్నచూపు చూడడంతో కక్ష పెంచుకుంది. బాలిక తల్లిపై ఉన్న కక్షతోనే హత్య చేసినట్లు మమత తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
