NTV Telugu Site icon

Mamata Banerjee: మదురై రైలు ప్రమాదంపై దీదీ దిగ్భ్రాంతి

Mamtha

Mamtha

త‌మిళ‌నాడులోని మ‌ధురైలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం జ‌రిగింది. పున‌లూరు – మ‌ధురై ఎక్స్‌ప్రెస్‌లోని ఓ ప్రైవేటు పార్టీ కోచ్‌లో మంట‌లు చెల‌రేగి 10 మంది స‌జీవ‌ద‌హ‌నం అయ్యారు. ల‌క్నో నుంచి రామేశ్వరం వెళ్తున్న ఈ రైలులో శ‌నివారం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వేని కోరారు.

Read Also: Asia Cup 2023 : ఆసియాక‌ప్ ఆరంభానికి ముందు క‌రోనా ముప్పు..?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో బెనర్జీ పోస్ట్ చేస్తూ, “రైల్వేలో మరో విషాద సంఘటన జరిగింది. ఈసారి మధురై (తమిళనాడు)లో ఈరోజు ఒక రైలులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తొమ్మిది మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. తక్కువ సమయంలో కనీసం 20 మంది తీవ్రంగా కాలిపోయారు. అని తెలిపారు. అంతేకాకుండా.. “నేను మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ప్రమాదంపై విచారణ జరిపిన తర్వాత త్వరలో బాధ్యతలు పరిష్కరించబడతాయని ఆశిస్తున్నాను. భద్రత, మానవ జీవితం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని నేను రైల్వే అధికారులను కోరుతున్నానని దీదీ పేర్కొన్నారు.

Read Also: Rozgar Mela: ప్రభుత్వ శాఖల్లో రోజ్‌గార్‌ మేళా.. 51 వేల మందికి నియామక పత్రాలు ఇవ్వనున్న ప్రధాని

గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన మమతా.. ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం మమత కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ ఏడాది జూన్‌ 2న ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతులకు సంతాపం తెలిపి సంఘటనా స్థలాన్ని సందర్శించారు.