సకాలంలో ఎన్నికలు నిర్వహించనందుకు ప్రపంచ రెజ్లింగ్ అపెక్స్ బాడీ UWW రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI)ని గురువారం సస్పెండ్ చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇది దేశానికి ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు. “యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యుడబ్ల్యు) డబ్ల్యుఎఫ్‌ఐని సస్పెండ్ చేసిందని తెలిసి షాక్ అయ్యానని మమతా బెనర్జీ తెలిపారు. ఇది యావత్ దేశం సిగ్గుపడాల్సిన విషయం. మన కుస్తీ సోదరీమణుల దీనస్థితిపై కేంద్ర ప్రభుత్వం అవమానకరంగా అహంకారంతో వ్యవహరిస్తూ నిరాశపరిచిందని ఆమే పేర్కొన్నారు. అంతేకాకుండా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతదేశ సోదరీమణులను స్త్రీద్వేషం, పురుష దురహంకారంతో ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని.. ఇంకెంతో సమయం లేదని దీదీ దుయ్యబట్టారు.
Solar Energy: సోలార్ ఎనర్జీ ఉపయోగాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి మీకు తెలుసా?
మరోవైపు UWW యొక్క నిర్ణయం కారణంగా.. రాబోయే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో భారతీయ రెజ్లర్లు భారత జెండా తరుపున ఆడలేరు. సెప్టెంబర్ 16న ప్రారంభమయ్యే ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తటస్థ ఆటగాళ్లుగా పాల్గొంటారు. భూపేంద్ర సింగ్ బజ్వా నేతృత్వంలోని తాత్కాలిక ప్యానెల్‌కు ఎన్నికల నిర్వహణకు 45 రోజుల గడువు ఇచ్చారు. రెజ్లింగ్ పనితీరును పర్యవేక్షించేందుకు ఏప్రిల్ 27న ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) ఈ ప్యానెల్‌ను నియమించింది.
TS High Court: గద్వాల ఎమ్మెల్యేకు షాక్.. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు
డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు మే 7న జరగాల్సి ఉండగా.. అది చెల్లదని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. WFI ఎన్నికలను జూలై 11న నిర్వహించాలని ఎన్నికల అధికారి మళ్లీ నిర్ణయించారు. అయితే అస్సాం రెజ్లింగ్ అసోసియేషన్ గౌహతి హైకోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత కోర్టు ఎన్నికలపై స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రా రెజ్లింగ్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. గౌహతి హైకోర్టు నిర్ణయాన్ని కోర్టు పక్కన పెట్టింది. డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు ఆగస్టు 12న జరుగుతాయని ఎన్నికల అధికారి తెలిపారు. అయితే పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ పిటిషన్‌పై స్టే విధించింది.
