NTV Telugu Site icon

Kalki 2898 AD : ఉత్తర పాత్రలో మాళవిక నాయర్.. అస్సలు ఊహించలేదుగా..

Malavika

Malavika

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.రీసెంట్ గా ఈ చిత్రం నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ఎంతో రిచ్ గా తెరకెక్కించారు.ఫస్ట్ ట్రైలర్ తోనే మెప్పించిన నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.ఈ ట్రైలర్ తో ప్రేక్షకులకి అర్థమైపోయింది.. ఈ సినిమా ఊహించని స్థాయిలో విజయం అందుకుంటుందని కామెంట్ చేస్తున్నారు.ప్రతి ఒక్క షాట్ కూడా అద్భుతం అనేలా నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించారు.

Read Also :Kalki 2898 AD : కల్కి ట్రైలర్ పై ఆర్జీవి పజిల్.. కనిపెడితే లక్ష ఇస్తానంటూ బంపర్ ఆఫర్..?

ఇదిలా ఉంటే ఈ సినిమాలో వరుసగా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ రివీల్ అవుతున్నాయి.మొన్న శోభన ,నిన్న అన్నాబెన్ ,నేడు మాళవిక నాయర్.అయితే ఈ సినిమా కథ ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో భాగంగా అర్జునిడికి ,అశ్వద్ధామకి భీకర యుద్ధం జరుగుతుంది.ఈ యుద్ధంలో ఇరువురు బ్రహ్మాస్త్రాలను ఉపయోగిస్తారు.అది లోక వినాశనమని వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యాసుడు చెప్పగా అర్జునుడు ఉప సంహరించుకుంటాడు .కానీ అశ్వద్ధామకు ఎలా ఉపసంహరించాలో తెలీదు.దీనితో ఆ బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడి కొడుకు అభిమన్యు భార్య అయిన ఉత్తర గర్భంవైపుకు మళ్ళిస్తాడు. దీనితో పాండవ వంశ పతనం జరుగుతుందని భావిస్తాడు.కానీ శ్రీకృష్ణుడు ఉత్తరను కాపాడి అశ్వద్ధామ ను కలియుగాంతం వరకు చావు లేకుండా ఒంటి మీద గాయాలతో చీము పట్టి చావు కోసం ఎదురు చూస్తుండు అని శపిస్తాడు.ఆలా అశ్వద్ధామ చావు కోసం ఎదురు చూస్తుంటాడు.ఈ సినిమాలో అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్ ,అలాగే ఉత్తరగా మాళవిక నాయర్ కనిపించారు.