Site icon NTV Telugu

Malreddy Ranga Reddy : ఉద్యమకారులకు, ఇళ్ల స్థలాలు లేని, పేదలకు ఇండ్ల పట్టాలిస్తాం

Malreddy Rangareddy

Malreddy Rangareddy

తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే.. ప్రజలకు కాంగ్రెస్‌ ఇవ్వనున్న పథకాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, చౌదర్పల్లి, చిన్నతుల్లా, ధర్మన్నగూడ, పెద్ద తుళ్ల, ఎలిమినేడ్, కప్పాడు, చర్ల పటేల్ కూడా, కర్నగూడ, గ్రామాలలో, మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ టీడీపీ శ్రేణులతో కలిసి, విస్తృత స్థాయిలో ప్రచారం చేశారు.

అడుగడుగునా సోదరీమణులు మల్ రెడ్డి రంగారెడ్డి హారతి ఇచ్చి నుదిటిన తిలకం దిద్దారు. అనంతరం, రోడ్ షో లో మాట్లాడుతూ, ప్రతి పేదవానికి, తెలంగాణ ఉద్యమకారులకు, కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం, ఆరు సంక్షేమ పథకాలే కాకుండా, స్థానిక సమస్యలను, ఇండ్ల పట్టాలను, ఇస్తామని, నాడు గరీబి హటో కార్యక్రమం, ఇందిరాగాంధీ చేపట్టిందని, నేడు తెలంగాణ ఇచ్చిన తల్లి, సోనియాగాంధీ, పేదల పక్షపాతి అని, మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. అభివృద్ధి కావాలంటే, పేదల ప్రభుత్వం రావాలంటే, హస్తం గుర్తుకే ఓటేయాలని, అభ్యర్థించారు, ఇక్కడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పేద ప్రజల భూములు దోచుకున్నాడని, ఉద్యోగ వాళ్ళు ఇప్పిస్తానని కంపెనీలకు అమ్ముడుపోయాడని, తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు, నెల రోజుల్లో, సామాన్యులకు, మంచి ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం అని, అన్నారు,

Exit mobile version