Site icon NTV Telugu

Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్.. ఎవరంటే..?

Malnadu

Malnadu

Malnadu Drugs Case: మల్నాడు డ్రగ్స్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. వ్యాపారవేత్త సందీప్ జువ్వాడితో పాటు సాఫ్ట్వేర్ ఇంజీనీర్ లోచన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ జువ్వాడి ఇంట్లోనే డ్రగ్ పార్టీలు జరిగినట్లు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని పార్టీలు నిర్వహించినట్లు తేలింది. మల్నాడు డ్రగ్స్ కేసులో ఏడు పబ్‌లకు నోటీసులు జారీ చేశారు. ప్రిజం పబ్, ఒకా పబ్, క్వాక్ పబ్, బ్రాడ్ వే, ఓక కోరా, క్వాక్ పబ్, పబ్బులకు నోటీసులు పంపారు.. డ్రగ్ పార్టీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు పబ్బులు చేసినట్లు గుర్తించారు. పబ్ యజమానుల పాత్రతోనే మల్నాడు డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు పోలీసుల తేల్చారు.

READ MORE: Bone Health tips: మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?.. ‘బొక్కలు’ ఇరుగుతాయ్.. జాగ్రత్త!

మరోవైపు.. ఈగల్‌ టీమ్‌ ఇటీవల నిర్వహించిన డెకాయ్‌ ఆపరేషన్‌లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అలాగే హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (హెచ్‌ న్యూ) పోలీసులకు పట్టుబడిన డ్రగ్స్‌ ముఠా అరెస్టు కేసులో పబ్బులతో ఉన్న లింకులు బయటపడ్డాయి. డ్రగ్స్‌ స్మగ్లర్లు మాదకద్రవ్యాలను నిర్వాహకులకు సరఫరా చేసినట్లు తేటతెల్లమైంది. పబ్‌ కల్చర్‌కు అలవాటైన యువతను వలపు వలతో మత్తుకు బానిసలు చేస్తున్నారు. సంపన్నుల పిల్లలు, వైద్యులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు బాధితులుగా ఉన్నారంటే నెట్‌వర్క్‌ ఎలా ఉందో అర్థమవుతోంది.

READ MORE: Raksha Bandhan 2025: ప్రధాని మోడీ కోసం రాఖీ సిద్ధం చేసిన పాక్ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్..

Exit mobile version