దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో ఎన్నో భారీ ప్రకటనలు చేశారు. బీహార్, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే మిత్రపక్షాలు సంబురాలు చేసుకుంటున్నాయి. అదే సమయంలో బడ్జెట్‌పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ ప్రభుత్వ బడ్జెట్ లో కుర్చీ కాపాడిన రెండు రాష్ట్రాలకే మేలు జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యానించారు. యువత కోసం ప్రవేశ పెట్టిన పథాకాలు.. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టో నుంచి కాపీ పేస్ట్ చేశారని ఆరోపించారు. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మల్లికార్జున్ ఖర్గే విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందన్నారు. రైతుల కోసం అనుకున్న మేరకు పథకాలు కేటాయింపులు లేవని పేర్కొన్నారు. రైల్వే ప్రమాదాల నియంత్రణపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన లేదన్నారు.
READ MORE: CM Chandrababu: ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది..
ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోలేదు..
ఖర్గె మాట్లాడుతూ.. “రైల్వే ట్రాక్‌లను మెరుగుపరచడం, ప్రజల భద్రత వంటి అంశాల్లో ఏమీ చేయలేదు. ఈ కారణంగా, బలహీనమైన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరదల నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. పేదలు, దళితులకు చేసిందేమీ లేదు. బడ్జెట్‌లో కుల గణనకు నిధులు కేటాయించి ఉండాల్సింది. కానీ, దీని ప్రస్తావన కూడా లేదు.” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Gold price drop: బడ్జెట్ ఎఫెక్ట్.. రూ. 4000 తగ్గిన బంగారం, వెండి ధరలు..
“ఈ ప్రభుత్వం బడ్జెట్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో నుంచి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను కాపీ పేస్ట్ చేసింది. ద్రవ్యోల్బణంతో దేశం అతలాకుతలం అవుతోంది. దాన్ని ఎలా వదిలించుకోవాలనే అంశంపై బడ్జెట్‌లో ప్రస్తావన లేదు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి కూడా ఒరిగిందేమీ లేదు. ఈ ప్రభుత్వం వాగ్దానాలు మాత్రమే చేస్తుంది. ఎన్నికల ముందు హామీల గురించి మాట్లాడుతున్నారు.. కానీ బడ్జెట్‌లో హామీలు కనిపించడం లేదు. మోడీకి అబద్ధాలు చెప్పడం అలవాటు. నాకు ఎప్పుడైనా అవకాశం దొరికితే, అతని పది పెద్ద అబద్ధాలు చెబుతాను.” అని చెప్పుకొచ్చారు.