Site icon NTV Telugu

Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యా (అప్పాజీ)పై పోక్సో కేసు.. కుటుంబీకుల ముందే మైనర్ బాలికతో వికృత చేష్టలు!

Mallikarjun Mutya

Mallikarjun Mutya

Mallikarjun Mutya: మల్లికార్జున ముత్యా అలియాస్ అప్పాజీ.. ఈ పేరు సోషల్ మీడియాలో వినే ఉంటారు. అపార శక్తులు ఉన్నాయంటూ ఆ మధ్య తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం సాగింది. చాలా మంది తెలుగు ప్రజలు ఆ యువకుడికి కలవడానికి బారులు తీరేవారు. ఆ మధ్య కొన్ని విమర్శలు రావడంతో కనుమరుగైపోయాడు. తాజాగా మరోసారి మల్లికార్జున ముత్యా వార్తల్లో నిలిచాడు. కర్ణాటకలోని యాద్గిర్‌లో స్వయంఘోషిత స్వామిగా పేరుపొందిన మల్లికార్జున ముత్యాపై పోక్సో కేసు నమోదవడం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలో అప్పాజీ ఓ మైనర్ బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

READ MORE: Bank Holiday March 2026: ఖాతాదారులకు అలర్ట్.. మార్చిలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?

ఈ ఘటన ఫిబ్రవరి 19న మహల్ రాజా గ్రామంలో చోటుచేసుకున్నట్లు సమాచారం. అక్కడే ఉన్న మల్లికార్జున ముత్యా సందర్భనార్థం మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఒక కుటుంబం వచ్చింది. అదే సమయంలో మైనర్ బాలికను తన చెంతకు తీసుకున్నాడు అప్పాజీ.. బంధువుల సమక్షంలోనే ఆ బాలికకు ముద్దులు పెడుతూ వికృత చేష్టలు చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. వెంటనే వైరల్ అయ్యింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (KSCPCR) సుమోటోగా తీసుకుంది. కమిషన్ ఛైర్మన్ శశిధర్ కోసాంబే ఆదేశాల మేరకు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం యాద్గిర్ జిల్లాలో ఉన్న గోగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శహాపూర్ తాలూకా చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో, భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. ఘటన తర్వాత మల్లికార్జున ముత్యా రాత్రివేళ మఠం విడిచి తెలంగాణకు వెళ్లినట్లు సమాచారం. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హాజరు కాకపోతే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అరెస్ట్ చేసే అవకాశముందని పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు సాగుతోంది. కాగా.. మల్లికార్జున ముత్యా వయసు సుమారు 26–27 సంవత్సరాలుగా అంచనా. గత నాలుగేళ్లుగా సోషల్ మీడియాలో అప్పాజీ పేరుతో యాక్టివ్‌గా ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వేదికలపై ఈ యువకుడి వీడియోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. భక్తులు “అప్పాజీ”గా పిలుస్తుంటారు. ఉత్తర కర్ణాటకతో పాటు పరిసర ప్రాంతాల్లో కొందరు అప్పాజీని ‘నడిచే దేవుడు’గా భావిస్తూ ఆరాధిస్తున్నారు.

READ MORE: IND vs WI Qualification Scenarios: భారత్-వెస్టిండీస్ సెమీస్ రేస్ సమీకరణాలు.. అదే జరిగితే టీమిండియా ఇంటికే!

Exit mobile version