Site icon NTV Telugu

Kharge: ప్రధాని మోడీకి ఖర్గే 2 పేజీల లేఖ.. దేనికోసమంటే..!

Kde

Kde

దేశంలో ఎండలు మండుతున్నట్లుగానే.. రాజకీయ నాయకుల మాటలు కూడా మండితున్నాయి. ప్రచారంలో నేతలు మాటల-తూటాలు పేల్చుకుంటున్నారు. పోలింగ్ సమయాలు దగ్గర పడే కొద్దీ ప్రసంగాలు కూడా హీటెక్కుతున్నాయి. ప్రధాని మోడీ.. కాంగ్రెస్‌ను టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ గరంగరంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. ‘న్యాయ్ పాత్ర’ పేరుతో తమ పార్టీ మేనిఫెస్టోను వ్యక్తిగతంగా వివరించడానికి సమయం కావాలని లేఖలో కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మీ సలహాదారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారని అర్థమవుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ మేనిఫెస్టో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ న్యాయ్ పాత్ర పథకం.. యువత, మహిళలు, రైతులు, కార్మికులు, అన్ని కులాలు, వర్గాలలో అట్టడుగున ఉన్న ప్రజలకు న్యాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఖర్గే పేర్కొ్న్నారు.

ఇది కూడా చదవండి: UPSC Calendar: 2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల.. ఎగ్జామ్స్ ఎప్పుడంటే..!

ప్రధాని మోడీ ఇటీవల ప్రసంగాలలో ఉపయోగించిన భాష చూసి తాను ఆశ్చర్యపోలేదని ఖర్గే అన్నారు. మొదటి దశ ఎన్నికలలో బీజేపీ దీనావస్థను చూసిన తర్వాత మీరు, మీ పార్టీకి చెందిన ఇతర నేతలు ఈ విధంగా మాట్లాడతారని ఊహించామని తెలిపారు. మీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసం పని చేస్తుందని.. పేదల దగ్గర నుంచి భారీగా GST వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే అసమానత గురించి మాట్లాడినప్పుడు.. మీరు ఉద్దేశపూర్వకంగా హిందూ, ముస్లింల గురించి వ్యాఖ్యానిస్తున్నారని ఖర్గే ఆరోపించారు. ఈ విధంగా మాట్లాడితే పరువు దిగజారుతుందని లేఖలో ఖర్గే వివరించారు.

ఇది కూడా చదవండి: T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ అంబాసిడ‌ర్‌గా స్టార్ అథ్లెట్..

 

Exit mobile version