కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి బీఆర్ఎస్ సమావేశానికి మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ పోతుందని కలలో కూడా ఊహించలేదని ఆయన వ్యాఖ్యానించారు. గాలికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గాలిలోనే కలిసి పోతుందని, పద్దెనిమిది యేళ్ళు పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.తాగునీటి సాగునీరు అందించిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. అంతేకాకుండా… దేశానికి అన్నం పెట్టే రైతన్నను తయారు చేసిన నాయకుడు కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు.
Janasena vs TDP: పశ్చిమ టికెట్..! టీడీపీ – జనసేన మధ్య ముసలం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కు ముందు వలసలు వెళ్ళిన తెలంగాణ ప్రజలు రాష్ట్ర ఏర్పాటు తర్వాత 15 రాష్ట్రాల నుంచి వలస వచ్చిన ఘనత కేసీఆర్‌ది అని ఆయన కొనియాడారు. 56 ఏళ్ళ పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజలకు ఏం చేసిందని మల్లారెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి 40 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదన్నారని, సెక్రటేరియట్ కమాండ్ కంట్రోల్ రూం, అమరవీరుల స్థూపం, కాకతీయ పేరుతో చెరువుల తవ్వించారు. ఇది కాదా కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యకర్తలు అధైర్య పడవద్దని రానున్న ఎన్నికల్లో 15 వేలు వేస్తానన్నారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చిన ఘనత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌ది అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీల వలన కరీంనగర్ కి జరిగిన అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో 16 కు పదహారు సీట్లు గెలిపించాలని కోరారు.