Site icon NTV Telugu

Malladi Vishnu : ఐదెకరాల కోసమే శాతవాహన కాలేజీని కూల్చేశారు.. మల్లాది విష్ణు ఆరోపణలు

Malladi Vishnu

Malladi Vishnu

Malladi Vishnu : శాతవాహన కాలేజీని ఐదెకరాల కోసమే కూల్చేశారని మాజీ మంత్రి మల్లాది విష్ణు అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణులపై దాడులు పెరిగిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి నిదర్శనమే విజయవాడలోని శాతవాహన కాలేజీని కూల్చేయడం అంటూ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి కారణాలు లేకుండానే కాలేజీని కూల్చేసిందన్నారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు మల్లాది విష్ణు. ఆ కాలేజీలో స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఉన్నా సరే కనీసం పట్టించుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు మల్లాది విష్ణు.

Read Also : Janardhan Reddy : కమీషన్ల కోసమే బుగ్గన అక్రమాలు.. మంత్రి జనార్థన్ రెడ్డి ఫైర్..

‘ఈ కాలేజీ కేసులో ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీ కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు. ఈ కాలేజీకి చెందిన ఐదెకరాల భూమిని కబ్జా చేయడం కోసమే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. కోర్టు తీర్పు ఉందని ఇలాంటి అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. ఏపీలో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులను టార్గెట్ చేస్తోంది. రెడ్ బుక్ చివరకు కాలేజీల మీ కూడా వర్తింపజేస్తున్నారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ దీనిపై స్పందించాలి. అక్రమంగా భూములు లాక్కుంటే ఎందుకు మాట్లాడట్లేదు.

కంప్లయింట్ ఇచ్చినా సరే పోలీసులు పట్టించుకోవట్లేదు. గత వైసీపీ హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో కూటమి దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసినవారిపై న్యాయ పోరాటం చేయడానికి మేం రెడీగా ఉన్నాం’ అంటూ మల్లాది విష్ణు ఫైర్ అయ్యారు.

Read Also : Nagarjuna: కొడుకు పెళ్లి హడావుడిలోనూ సినిమా కోసమే నాగ్ తపన!

Exit mobile version