Maldives- India: భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ బీచ్‌లో పర్యటించడంతో మాల్దీవులకు చెందిన మంత్రులు మోడీని విమర్శించడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో మాల్దీవుల ప్రభుత్వం దిద్దబాటు చర్యల్లో భాగంగా ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసింది. అలాగే, మాల్దీవులకు వ్యతిరేకంగా భారత్ కు చెందిన పర్యాటకులు తమ ప్రయాణ టికెట్లను భారీగా క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు పలు విమాన సంస్థలు సైతం అక్కడ తమ సర్వీసులను నడిపించేందుకు నిరాకరించాయి.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
అయితే, భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మాల్దీవులు గొడవ చేయడం సరికాదని అర్థమైంది. చైనా పర్యాటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారత పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే, మాల్దీవులపై తాము రెచ్చగొట్టడం గానీ, ఒత్తిడి చేయడం గానీ చేయలేదని ఇప్పటికే చైనా స్పష్టం చేసింది. గతేడాది నవంబర్‌లో బాధ్యతలు చేపట్టిన ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత టర్కీ, యూఏఈ, చైనా దేశాల్లో పర్యటించారు. కానీ, మాల్దీవుల సంప్రదాయానికి భిన్నమైంది. అలాగే, ఇంతకు ముందు మాల్దీవుల అధ్యక్షులెవరూ భారతదేశాన్ని మొదటిసారి సందర్శించలేదు.