ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను మలయాళం సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. మలయాళం సినిమాలపై తెలుగు ప్రేక్షకులు మోజు పెంచుకుంటున్నారు.మలయాళం సినిమాలు చిన్న సినిమాలు గా రిలీజై భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి మలయాళం సూపర్ హిట్ మూవీస్ లో జయజయజయజయహే మూవీ ఒకటి. ఈ మూవీ 2022లో మలయాళం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో బాసిల్ జోసెఫ్ మరియు దర్శనరాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి విపిన్ దాస్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా భారీ విజయాన్ని సాధించింది.కేవలం 5కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ మూవీ 45 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. నిర్మాతలకు పదింతల లాభాలను మిగిల్చింది.
ముఖ్యంగా ఈ మూవీలో జయ పాత్రలో దర్శనరాజేంద్రన్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. భర్త పెట్టే చిత్రహింసలను భరించలేక అతడిపై ఎదురుతిరగే భార్య పాత్రలో దర్శన రాజేంద్రన్ అద్భుతంగా నటించింది.ఇదిలా ఈ సూపర్ హిట్ మూవీ తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఈ మలయాళం రీమేక్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.మలయాళ ఒరిజినల్ మూవీలో హీరోయిన్‌గా నటించిన దర్శన రాజేంద్రన్ ఈ రీమేక్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం..జయజయజయ జయహే రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది.ఇక తరుణ్ భాస్కర్ రీసెంట్ గా తెరకెక్కించిన కీడా కోలా మూవీ ప్రేక్షకులను మెప్పించిన కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు. కీడాకోలా మూవీలో చైతన్యరావు, బ్రహ్మానందం మరియు రాగ్‌మయూర్ కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తూనే డైరెక్టర్ గా సినిమాలు చేస్తున్నాడు.