తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ రోజు రోజుకు బాగా పెరిగి పోతుంది .అలాగే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్ బాగా పెరిగింది. గత రెండు నెలల నుంచి మలయాళ మూవీ ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి .అవి కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషలలో కూడా డబ్ అయి అక్కడ కూడా అద్భుత విజయాన్ని సాధిస్తున్నాయి .ఈ ఏడాది ‘భ్రమయుగం’ మరియు ‘ప్రేమలు’ వంటి సినిమాలతో వరుస హిట్స్ అందించిన మాలీవుడ్ రీసెంట్‌గా ‘మంజుమ్మెల్ బాయ్స్’ మూవీతో తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్‌ను అందుకుంది. సర్వైవర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ మూవీ ఫిబ్రవరి 22న విడుదలై ఒక్క మలయాళంలోనే ఏకంగా రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది.మలయాళంలో దుమ్ము రేపిన మంజుమ్మెల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 05న థియేటర్స్ లో విడుదల చేయగా ఇక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో మంచి కలెక్షన్లు రాబట్టింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ఓటిటి డేట్ ఫిక్స్ అయింది . ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ చిత్రం మే 03 నుంచి మలయాళం, తెలుగు, తమిళం హిందీ మరియు కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ చిత్రానికి చిదంబర్ పీ పొదువల్ దర్శకత్వం వహించారు . ఈ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్ మరియు అభిరాం ముఖ్య పాత్రలలో నటించారు.. 2006లో తమిళనాడు కొడైకెనాల్‌లోని గుణ గుహలలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా మంజుమ్మేల్ బాయ్స్ మూవీ తెరకెక్కింది . ప్రమాదవశాత్తూ లోయలో పడిన తమ స్నేహితుడిని కాపాడేందుకు అతని స్నేహితులు చేసిన ప్రయత్నమే ఈ సినిమా కథ .ఆద్యంతం ఉత్కంఠత రేపే విధంగా ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది ..ఇప్పుడు ఓటిటి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధం అయింది . .
Malayalam Cinema's Biggest BLOCKBUSTER Movie #ManjummelBoys Digital Premiere From May 3 On Disney+Hotstar… pic.twitter.com/a2vNNPAHd1
— The South Movies (@TheSouthMovies1) April 19, 2024
