Site icon NTV Telugu

Aparna Das Marriage: గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్!

Aparna Das, Deepak Parambol

Aparna Das, Deepak Parambol

Aparna Das And Deepak Parambol Get Married: మలయాళీ భామ, యంగ్ హీరోయిన్ అపర్ణ దాస్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇటీవల మలయాళంలో ఘన విజయం సాదించిన ‘మంజుమ్మల్ బాయ్స్’లో నటించిన దీపక్ పరంబోల్‌ని ఆమె పెళ్లి చేసుకున్నారు. బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం కేరళలోని గురువాయూర్ ఆలయంలో అపర్ణ, దీపక్‌ల వివాహం చాలా సింపుల్‌గా జరిగింది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్దిమంది బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

అపర్ణ దాస్ తన పెళ్లికి తెలుపు మరియు బంగారం కలయికలో ఉన్న చీరలో మెరిశారు. భారీ ఎంబ్రాయిడరీతో ఉన్న ఆకుపచ్చ బ్లౌజ్, బంగారు ఆభరణాల మధ్య అపర్ణ చాలా అందంగా ఉన్నారు. మరోవైపు వరుడు దీపక్ పరంబోల్ మాత్రం సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. అపర్ణ, దీపక్ జంట చుడముచ్చగా ఉంది. అపర్ణ, దీపక్ కలిసి ‘మనోకరం’ మూవీలో నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయమే ప్రేమగా మారింది. ఇరు కుటుంబసభ్యులు అంగీకారంతో ఇద్దరు ఒక్కటయ్యారు.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

2018లో ‘న్యాన్ ప్రకాషన్’ సినిమాతో అపర్ణ దాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ‘దాదా’ మూవీలో హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఆమెకు.. విజయ్ ‘బీస్ట్’ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. మనోహరం, బీస్ట్, దాదా, ఆదికేశవ, సీక్రెట్ హోమ్ లాంటి చిత్రాలతో తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులకు అపర్ణ దగ్గరయ్యారు. ప్రస్తుతం అపర్ణ ఓ సినిమా చేస్తున్నారు. ఒమన్‌లో పుట్టి పెరిగిన అపర్ణకు చిన్నప్పటినుంచి సినిమాల మీద మక్కువ. దీపక్ పరంబోల్పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Exit mobile version