NTV Telugu Site icon

Kantara Chapter 1: కాంతార చాఫ్టర్‌-1లో మాలీవుడ్‌ యాక్టర్!

Kantara Chapter 1

Kantara Chapter 1

Is Malayalam Actor Jayaram in Kantara Chapter 1: ‘కాంతార’ సినిమాతో రిషబ్‌ శెట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్‌-1 సిద్ధమవుతోంది. రిషబ్‌ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్‌ 1 ఫస్ట్ లుక్‌, టీజ‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈసారి కూడా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని టీజర్‌ బట్టి అర్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Also Read: Kalki 2898 AD: అమెజాన్‌ ప్రైమ్‌లో ‘బుజ్జి అండ్‌ భైరవ’ యానిమేటెడ్‌ సిరీస్‌!

కాంతార చాఫ్టర్‌-1 ప్రముఖ నటుడు కీ రోల్‌ చేస్తున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళం యాక్టర్ జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. జయరామ్ ఇప్పటికే కాంతార షూట్‌లో జాయిన్‌ అయ్యాడని సమాచారం. మరి దీనిపై మేకర్స్ ఏదైనా అధికారిక ప్రకటన చేస్తారా? అన్నది చూడాలి. భాగమతి, అల వైకుంఠపురంలో, గుంటూరు కారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు జయరామ్ సుపరిచితుడే. కాంతార ప్రీక్వెల్‌తో జయరామ్‌ నటిస్తే.. ఆయన స్టేటస్‌ పాన్ ఇండియా రేంజ్‌లో మార్మోగిపోవడం పక్కా. ‘కాంతార ఏ లెజెండ్’ అనే పేరుతో చాఫ్టర్‌-1 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show comments