Site icon NTV Telugu

Malavika Sreenath : గదిలోకి వెళ్లగానే గట్టిగా హగ్ చేసుకున్నాడు.. హీరోయిన్ మాళవిక

Malavika Sreenath

Malavika Sreenath

Malavika Sreenath : కొన్ని సంవత్సరాల క్రితం ‘మీటూ’ ప్రచారం ద్వారా సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ముఖ్యంగా నటీమణులు తమ లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఇందులో పలువురు సెలబ్రిటీల మరో ముఖం బయటపెట్టారు. తాము అనుభవించిన గతానుభవాలను లోకానికి చెప్పుకున్నారు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన యువ నటి మాళవిక శ్రీనాథ్ కొన్నేళ్ల క్రితం ఆడిషన్ పేరుతో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది.

Read Also: Jio Studios : శుభవార్త.. జియో కంపెనీ మరో విప్లవం సృష్టించనుంది

ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “కొన్ని సంవత్సరాల క్రితం ఒక చిత్రంలో మంజు వారియర్ కుమార్తె పాత్రను పోషించడానికి ఒక ఆడిషన్ జరిగింది. మంజువారియర్ సినిమాలో నటిస్తే చూడాలని ఎవరు అనుకోరు? అందుకని దానికి హాజరయ్యేందుకు అమ్మ, చెల్లెలుతో కలిసి అక్కడికి వెళ్లాను. ప్రత్యేక గదిలో ఆడిషన్ పరీక్షకు హాజరైన వ్యక్తి నా జుట్టు సరిగ్గా లేదని, దాన్ని సరిచేయడానికి నన్ను పక్క గదిలోకి వెళ్లమని చెప్పాడు.

Read Also: Manchu Manoj: ‘ఉప్పెన’ సినిమాలోలా దేశాలు పారిపోయాం.. నేను బ్రతికి కూడా వేస్ట్ అనుకున్నా

నేను అక్కడికి వెళ్లగానే తను వెనకాల నుంచి వచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఒక్కసారిగా షాక్‌ అయిన నేను తన నుంచి విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించాను. నువ్వు మంజు వారియర్‌ కూతురిగా స్క్రీన్‌పై కనిపించాలంటే పదినిమిషాలు సైలెంట్‌గా ఉండు అని చెప్పాడు. నేను ఏడుస్తూ తన చేతిలో ఉన్న కెమెరాను పగలగొట్టేందుకు ప్రయత్నించాను. అతడు దాన్ని సరిచేసుకునే క్రమంలో వెంటనే అక్కడి నుంచి పారిపోయాను. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తేనే.. ఇది భయంకరమైన అనుభవంగా అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. మధురం, సాటర్‌డే నైట్‌ వంటి చిత్రాలు చేసింది.

Exit mobile version